చంద్రబాబు, లోకేష్ కు పవన్ దిమ్మతిరిగే షాక్

First Published Apr 20, 2018, 11:56 AM IST
Highlights

తన తల్లిని అవమానించిన పెద్దలెవరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన తల్లిని అవమానించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోశించిందన్నారు. ఆ పార్టీకి వెనుకా ముందూ మీడియా సపోర్టు చేసిందని మండిపడ్డారు. టివి9 ఓనర్ శ్రీనిరాజు, టివి9 సిఇఓ రవి ప్రకాష్, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టివి 9 ఓనర్ శ్రీనిరాజు లను బజారులో నిలబెట్టారు పవన్. అలాగే శాడిష్టు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మను సైతం బజారుకీడ్చారు పవన్.

వీళ్లు ముగ్గురితో నాటకాలు ఆడించింది తెలుగుదేశం పార్టీ అని మండిపడ్డారు పనవ్. శుక్రవారం ఉదయం నుంచి పవన్  ట్విట్టర్ లో వరుస పోస్టులతో విరుచుపడ్డారు. పనిలో ఎపి సిఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే పవన్ కరుకైన పోస్టులతో విమర్శల వర్షం కురిపించారు.  ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు కొడుకు లోకేష్ కుయుక్తులు కూడా ఉన్నాయని పవన్ తీవ్రంగా మండిపడ్డారు.

పదికోట్లు ఖర్చు పెట్టించి మరీ తనను, తన తల్లిని బూతులు తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు.. కానీ ఇప్పుడు దొరలు అంటే మీడియా ఆసాములే అని మీడియాపై తీవ్రంగా మండిపడ్డారు. మీడియా వారు చెప్పిందే వేదం.. పాడిందే నాదం గా పరిస్థితి తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ పోస్టులతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. లక్షలాది మంది పవన్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీపై, పవన్ పై కుట్ర చేసిన మీడియాపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ మీడియా ముందు కూడా తన కుటుంబంపై జరిగిన దుప్రచారాన్ని ఖండించే అవకాశం ఉంది. ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ మీడియాకు అన్ని అంశాలపై వివరణ ఇవ్వనున్నారు.

click me!