చెస్ట్ ఆసుపత్రి నుండి పేషెంట్ మిస్సింగ్, పనిచేయని సీసీ కెమెరాలు

Published : May 18, 2021, 04:33 PM IST
చెస్ట్ ఆసుపత్రి నుండి పేషెంట్ మిస్సింగ్, పనిచేయని సీసీ కెమెరాలు

సారాంశం

హైదరాబాద్ లోని చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ నేటి ఉదయం నుండి కనబడడం లేదు.

హైదరాబాద్ లోని చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ నేటి ఉదయం నుండి కనబడడం లేదు. 55 సంవత్సరాల అంతటి పెంటమ్మను నిన్న చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ చేస్త ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. హోమ్ ఐసొలేషన్ లో అప్పటివరకు ఉన్న ఆమె ఆక్సిజన్ స్థాయి పడిపోతుండడంతో మెరుగయినా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. 

ఆమె కోసం నేటి ఉదయం ఆసుపత్రి వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె ఆసుపత్రిలో కనిపించడం లేదు అన్న సమాచారం తెలుసుకొని షాక్ కి గురయ్యారు. ఆవిడ కోసం ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఆరు గంటల పాటు వెతికారు. ఆసుపత్రిలో  ఇవ్వమని కోరగా.... అవి పనిచేయడంలేదని తీరిగ్గా సమాధానం ఇచ్చాయి ఆసుపత్రి వర్గాలు. 

పేషెంట్ తప్పిపోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిమ్ప్టమ్స్ నుండి బాధపడుతున్నట్టు డాక్టర్లు చెప్పారు. ఇందువల్ల ఆమె మానసిక స్థితి సరిగా లేదని చేస్త ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ ని సంప్రదించగా వివరించారు. 

ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీలు ఉన్న అతికొద్ది నగరాల్లో ఒకటైన హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో సీసీటీవీలు పనిచేయకపోవడం నిజంగా విడ్డూరం. ఒక పేషెంట్ ఆసుపత్రిలోనుంచి వెళ్లిపోతుంటే అక్కడ ఉండాల్సిన వార్డ్ బాయ్స్ కానీ ఎవ్వరూ లేరా అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేయాలని అక్కడి వారు కోరుతున్నారు. ఆమె ద్వారా బయట ఎవరికైనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్నందున పోలీసులు గాలింపును వేగవంతం చేసారు. 

కరోనా బారినపడ్డ వారు మానసికంగా కృంగిపోతున్నారు. ఐసొలేషన్ లో ఉండడం, తమకేమైపోతుందోనన్న భయం అన్ని వెరసి పేషెంట్ ని మానసికంగా కృంగదీస్తున్నాయి. ఇదే పరిస్థితికి తమ తల్లి కూడా లోనయ్యుండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?