యాదాద్రి జిల్లా ఆలేరులో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండడంతో ఈ ప్రమాదం తప్పింది.
భువనగిరి: యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు కు ఆదివారంనాడు ముప్పు తప్పింది.ఆలేరు రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టా విరిగింది. ఆలేరు రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో రైలు భారీ శబ్దంతో ప్రయాణించింది.ఈ విషయాన్ని గమనించిన ప్రయాణీకులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రైలును వెంటనే నిలిపివేశారు. రైల్వే సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తే రైలు పట్టాలు విరిగిన విషయాన్ని గుర్తించారు. వెంటనే మరమ్మత్తులు నిర్వహించారు. మరమ్మత్తులు నిర్వహించిన తర్వాత రైలును పంపారు.
ఆదిలాబాద్ నుండి తిరుపతి వరకు కృష్ణా ఎక్స్ ప్రెస్ వెళ్తుంది. ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఆలేరు మీదుగా కృష్ణా ఎక్స్ ప్రెస్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణీకులు అప్రమత్తం కావడంతో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
undefined
రైలు పట్టాలను రైల్వే సిబ్బంది నిరంతరం గమనిస్తుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా రైల్వే సిబ్బంది ఉంటారు. ప్రతి రోజూ తమకు కేటాయించిన మేరకు రైల్వే సిబ్బంది రైల్వే పట్టాలను తనిఖీ చేస్తుంటారు.