ఇసుక మాఫియా నుండి డబ్బులు: పరిగి ఎస్ఐ‌పై సస్పెన్షన్ వేటు

By narsimha lodeFirst Published Nov 3, 2020, 8:03 PM IST
Highlights

ఇసుక మాఫియాను మామూళ్ల కోసం ఒత్తిడి చేసిన కేసులో పరిగి ఎస్ఐ వెంకటేశ్వర్లుపై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటేసింది.

పరిగి: ఇసుక మాఫియాను మామూళ్ల కోసం ఒత్తిడి చేసిన కేసులో పరిగి ఎస్ఐ వెంకటేశ్వర్లుపై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటేసింది.

పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక మాఫియా నుండి ఎస్ఐ మామూళ్లు తీసుకొంటున్నారు.. మామూళ్ల విషయంలో  ఇసుక వ్యాపారులతో ఎస్ఐ మాట్లాడిన ఆడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మామూళ్లు ఇవ్వాల్సిందేనని ఇసుక మాఫియాకు ఎస్ఐ  హుకుం జారీ చేశాడు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఎస్ఐ వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటేశారు.

ఇసుక మాఫియాను ఎస్ఐ ప్రోత్సహించారని ఈ ఆడియో ద్వారా వెల్లడైందని పోలీసు శాఖ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.దీంతో ఆయనపై చర్యలు తీసుకొన్నారు. ఇసుక మాఫియా నుండి డబ్బుల విషయంలో పోలీసుల మధ్య గొడవ కారణంగానే ఈ విషయం బయట పడింది.

ఇసుక మాఫియా  నుండి పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే తమ డిమాండ్ మేరకు డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఇసుక వ్యాపారులను ఎస్ఐ బెదిరింపులకు దిగాడని ఆడియోలో వెల్లడైంది. ఈ ఆడియో ఆధారంగా పోలీసు శాఖ విచారణ చేపట్టి చర్యలు తీసుకొంది. 
 

click me!