ఐపీఎల్ లో బెట్టింగ్: హైద్రాబాద్‌లో జార్ఖండ్ వాసి ఆత్మహత్య

Published : Nov 03, 2020, 06:54 PM IST
ఐపీఎల్ లో బెట్టింగ్: హైద్రాబాద్‌లో జార్ఖండ్ వాసి ఆత్మహత్య

సారాంశం

ఐపీఎల్  బెట్టింగ్ లో పాల్గొని ఆర్ధికంగా నష్టపోయిన జార్ఖండ్ రాష్ట్రానిక చెందిన సోనుకుమార్ ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: ఐపీఎల్  బెట్టింగ్ లో పాల్గొని ఆర్ధికంగా నష్టపోయిన జార్ఖండ్ రాష్ట్రానిక చెందిన సోనుకుమార్ ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైద్రాబాద్ పంజగుట్టలో స్నేహితులతో కలిసి కొబ్బరి బొండాలను సోనుకుమార్ విక్రయిస్తున్నాడు.ఐపీఎల్ లో సోనుకుమార్ బెట్టింగ్ కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆయన ఆర్ధికంగా చితికిపోయాడు. దీంతో మంగళవారం నాడు ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోనుకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాలపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘాను ఏర్పాటుచేస్తున్నాయి. అయినా కూడ బెట్టింగ్ రాయుళ్లు  మాత్రం రహస్యంగా బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో వేలాది రూపాయాలను పోగొట్టుకొంటున్నారు. సోనుకుమార్ ఆత్మహత్య ఉదంతంతో మరోసారి క్రికెట్ బెట్టింగ్  ఉదంతం మరోసారి వెలుగు చూసింది.

బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ను పురస్కరించుకొని దుబాయ్ లో పోటీలు సాగుతున్నాయి. ఐపీఎల్ పోటీలు కూడ ప్రస్తుతం చివరి దశకు చేరుకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం