పెళ్లికాక ముందే గర్భం.. అబార్షన్ వికటించడంతో...

Published : Sep 11, 2019, 10:06 AM IST
పెళ్లికాక ముందే గర్భం.. అబార్షన్ వికటించడంతో...

సారాంశం

 ఆమె గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందరపడటంతో ఆమె గర్భం దాల్చింది. గర్భం వచ్చి ఆరు నెలలు కావడంతో... ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయని కంగారుపడ్డారు. దీంతో... ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు.  


గత కొద్ది రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ మహిళ సగం కాలిన మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. యువతికి అబార్షన్ చేయించడానికి ప్రయత్నించగా... అది వికటించి ఆమె చనిపోయింది. ఈ క్రమంలోనే ప్రియుడే ఆమెను అక్కడ కాల్చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... కర్ణాటక రాష్ట్రం కలబుర్గి ప్రాంతానికి చెందిన ఇస్తేరాణి శిభ(22) డిగ్రీ సెంకడ్ ఇయర్ చదువుతోంది. ఆమె గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందరపడటంతో ఆమె గర్భం దాల్చింది. గర్భం వచ్చి ఆరు నెలలు కావడంతో... ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయని కంగారుపడ్డారు. దీంతో... ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు.

కుల్బర్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. అయితే... అక్కడ వైద్యం వికటించడంతో ఆమె చనిపోయింది. ఆమె ప్రాణాలు పోయిందని తెలిస్తే.. కేసు తనకు చుట్టుకుంటుందని ఆమె ప్రేమికుడు కంగారుపడ్డారు. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకొని కారులో తీసుకువచ్చి.. పరిగిలో పెట్రోల్ పోసి తగలపెట్టాడు. కాగా... కాలిన శవం కనపడటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్