సఫిల్‌గూడ డీఏవీ స్కూల్ అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే పాఠశాల గుర్తింపు రద్దుతో ఆందోళన చెందుతున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు. తప్పు చేసింది వాళ్లు అయితే.. మా పిల్లలు ఎందుకు నష్టపోవాలని వారి నిలదీస్తున్నారు.
హైదరాబాద్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దుతో ఆందోళన చెందుతున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతోన్న విద్యార్ధులు.. విద్యా సంవత్సరం నష్టపోకుండా వుండేలా పక్కనే వున్న పాఠశాలలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏడాది మధ్యలో స్కూల్ మారిస్తే విద్యార్ధులు ఎలా చదువుతారని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. తప్పు చేసింది వాళ్లు అయితే.. మా పిల్లలు ఎందుకు నష్టపోవాలని వారి నిలదీస్తున్నారు. స్కూల్ యాజమాన్యాన్ని మార్చి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇకపోతే... తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సఫిల్‌గూడ డీఏవీ స్కూల్ అత్యాచార ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ వేధింపులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె ఆదేశించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.
Also REad:బంజారాహిల్స్ అత్యాచార ఘటనపై తమిళిసై సీరియస్... నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌కు ఆదేశం
కాగా... బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఎస్ మాధవీపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.