స్వీట్ పాన్ లో మత్తుమందు కలిపి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం

First Published Jun 8, 2018, 10:23 AM IST
Highlights

ఫేస్ బుక్ ద్వారా ట్రాప్ చేసి..

 పాన్ హౌజ్ ఓనర్ స్వీట్‌పాన్‌లో మత్తు పదార్ధాలు కలిపి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాచిగూడలో నివాసముంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి నగరంలోని మయూర్ పాన్‌హౌస్ యజమాని ఉపేందర్‌వర్మ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ రెక్వెస్ట్ పంపాడు. దీనికి ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇక వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. 

అనంతరం ఆ ఉద్యోగినిని పెళ్లిచేసుకుంటానని నమ్మబలికిన ఉపేందర్ వర్మ ఆమెను పార్కులు, హోటళ్ల చుట్టూ తిప్పాడు. కాగా... రోజులు గడుస్తున్నా తనను పెళ్లి చేసుకోకపోవడంతో అనుమానం వచ్చిన ఆ ఉద్యోగిని.. తనను పెళ్లి చేసుకోవాలని ఉపేంధర్‌ను అడగంతో అతను తన అసలు రంగును బయటపెట్టాడు. కాగా... పార్కులు, హోటళ్ళ చుట్టూ తిరిగిన సమయంలో ఆమెకు స్వీట్‌పాన్ ఇచ్చేవాడు. 

అందులో మత్తుమందు కలిపి ఇవ్వడంతో అది తిన్న ఆమె మత్తులోకి జారుకున్న సమయంలో పలుమార్లు ఆమెపై అత్యాచారం జరపడమేగాక వీడియోలు కూడా తీశాడు. అనంతరం తనమాట వినకపోతే వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించేవాడు. ఉపేంధర్ చేతిలో తాను మోసపోయానని గ్రహించిన ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

click me!