అవినీతిపై ఆర్టీఐకి దరఖాస్తు చేసినందుకు, దళిత యువకుడికి పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు

Siva Kodati |  
Published : Aug 13, 2022, 06:21 PM IST
అవినీతిపై ఆర్టీఐకి దరఖాస్తు చేసినందుకు,  దళిత యువకుడికి పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు

సారాంశం

గ్రామంలో అవినీతిపై ఆర్టీఐకి దరఖాస్తు చేసినందుకు దళిత యువకుడిని బెదిరించాడు ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనుచరుడు ఇంటూర్ శేఖర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనుచరుడు ఇంటూరు శేఖర్ బూతులతో రెచ్చిపోయారు. కూసుమంచి మండలం జలచెరువు గ్రామంలో అవినీతి జరిగిందని ఆర్టీఐ ద్వారా సమాచారం అందుకున్న దళిత యువకుడిని అసభ్యపదజాలంతో దూషించాడు. ఇంటూర్ శేఖర్ బెదిరింపుల ఆడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘ఆర్టీఐ వేయడానికి నీకు ఏ హక్కు వుందని వేస్తున్నావ్.. నువ్వు ఏమనుకుంటున్నావ్, నా రేంజ్ ఏంటో తెలుసా. ఎవరు అసలు నీవు ఆర్టీఐకి నీకు ఏం సంబంధం. నువ్వు పెద్ద పుడింగ్‌వా. రేపు సాయంత్రం వరకల్లా నిన్ను ఇరికిస్తా. ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని అడుగుతావా’’ అంటూ ఇంటూరు శేఖర్ బెదిరించాడు. 
 

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu