భారత్ బయోటెక్‌: కరోనా వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించనున్న 64 దేశాల ప్రతినిధులు

By narsimha lodeFirst Published Dec 9, 2020, 12:40 PM IST
Highlights

 కరోనా వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకుగాను 64 దేశాలకు చెందిన ప్రతినిధులు హైద్రాబాద్ కు బుధవారం నాడు చేరుకొన్నారు. 
 


హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకుగాను 64 దేశాలకు చెందిన ప్రతినిధులు హైద్రాబాద్ కు బుధవారం నాడు చేరుకొన్నారు. హైద్రాబాద్ లోని భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారు చేస్తోంది.ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.

గత నెల 28వ తేదీన భారత్ బయోటెక్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు. వ్యాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించేందుకు గాను 64 దేశాల ప్రతినిధులు ఇవాళ ఉదయం హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ కు చేరుకొన్న విదేశీ బృందం సభ్యులను అధికారులు జినోమ్ వ్యాలీకి తరలించారు.  విదేశీ ప్రతినిధులు బృందం సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు.

ఒక బృందం  భారత్ బయోటెక్ కు, మరో బృందం బయోలాజికల్ ఈ ల్యాబ్ ను పరిశీలిస్తున్నారు.భారత్ బయోటెక్ లో కోవిడ్ వ్యాక్సిన్ పురోగతిని ఈ బృందాన్ని పరిశీలించనున్నారు.

భారత్ బయోటెక్ కు విదేశీ ప్రతినిధుల బృందం రావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ వ్యాక్సిన్ తయారీపై శాస్త్రవేత్తలతో విదేశీ ప్రతినిధులు చర్చించనున్నారు.ఎన్ని డోసులు ఏకకాలంలో తయారు చేస్తారనే  విషయమై చర్చించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు విదేశీ ప్రతినిధి బృందం  గడపనున్నారు.


 

click me!