బిజెపిపై మరో అస్త్రం: నామాతో ఓయు దళిత పరిశోధక విద్యార్థుల ఆవేదన

By telugu teamFirst Published Sep 15, 2019, 6:30 PM IST
Highlights

టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి నేతృత్వంలో దళిత పరిశోధక విద్యార్థులు లోకసభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావును కలిశారు. మూడేళ్లుగా కేంద్రం రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ లు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: కేంద్రం మూడేళ్లుగా రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ లు ఇవ్వడం లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయం దళిత పరిశోధక విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావుకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నేత, మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి నేతృత్వంలో ఓయూ దళిత పరిశోధక విద్యార్థి నేతలు నామాను కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బిజెపిపై అస్త్రంగానే దీన్ని భావిస్తున్నారు.

 రాజీవ్ గాంధీ నేషనల్ ఫెల్ షిప్ లపై ఓయు దళిత పరిశోధక విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు.ఫెలోషిప్ లకు యూజీసీ నెట్ తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేయాలని విద్యార్థులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో సుమారు 6 వేల మంది దళిత పరిశోధక విద్యార్థులకు నేషనల్ ఫెలోషిప్ లు రాకా ఇబ్బందులు పడుతున్నారాని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫెలోషిప్ లు అందక పరిశోధనలు కుంటుపడుతున్నాయని విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. కేంద్రం ఉపకార వేతనాలు మంజూరు చేయకపోవడంతో మెస్ బిల్లులు,ఇతర అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో ఇదే విషయంపై యూజీసీ సెక్రెటరీ,యూజీసీ సభ్యులు,కేంద్ర సామాజీకన్యాయ శాఖ మంత్రిత్వ అధికారులను పలు మార్లు కలిసిన ఎటువంటి స్పందన లేదని విద్యార్థులు ఎంపీ నామాకి తెలిపారు.

విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న ఎంపీ నామా, కేంద్రమంత్రికి లేఖ రాస్తానాని విద్యార్థులకు తెలిపారు.అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నేషనల్ ఫెలోషిప్ ల ఆంశాన్ని లోక్ సభలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. నామా నాగేశ్వరరావును కలిసినవారిలో మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవితో పాటు ఓయూ దళిత పరిశోధక విద్యార్థులు గదరాజు చందు,పాల్వాయి నగేష్,మబ్బు కర్ణాకర్,దూడపాక నరేష్,చిట్టెం శ్రీకాంత్,అల్లూరి విజయ్,సుధాకర్,పర్శారాములు తదితర విద్యార్థులు ఉన్నారు.

click me!