ఢిల్లీలో కేసీఆర్ ఇంటి ముందు తెలంగాణ ఉద్యమకారిణి ధర్నా.. అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు..

Published : Oct 15, 2022, 03:31 PM IST
ఢిల్లీలో కేసీఆర్ ఇంటి ముందు తెలంగాణ ఉద్యమకారిణి ధర్నా.. అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు..

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముందు  ఓయూ ఓల్డ్ స్టూడెంట్, తెలంగాణ ఉద్యమకారిణి దాత్రిక స్వప్న ధర్నాకు దిగారు. గత మూడు రోజులుగా కేసీఆర్‌ను అపాయింట్‌మెంట్ పడిగాపులు కాస్తున్నట్లు స్వప్న చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముందు  ఓయూ ఓల్డ్ స్టూడెంట్, తెలంగాణ ఉద్యమకారిణి దాత్రిక స్వప్న ధర్నాకు దిగారు. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాత్రిక స్వప్న ఢిల్లీలో కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రగతీ భవన్లో కేసీఆర్ను  కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకడం లేదని.. అందుకే కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారని తెలుసుకుని ఇక్కడకు వచ్చానని స్వప్న చెప్పారు. 

గత మూడు రోజులుగా కేసీఆర్‌ను కలిసేందుకు పడిగాపులు కాస్తున్నట్లు స్వప్న చెప్పారు. కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఆమె కేసీఆర్ నివాసం వెలుపల ధర్నాకు దిగారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు ఏదో ఉపాధి చూపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారిణిగా తనకుమంచి పేరుందని చెప్పారు. విశిష్ట ఉద్యమకారిణిగా కేసీఆర్ అవార్డు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

TGSRTC: సంక్రాంతి పండుగకు ఉచిత బస్సు స‌దుపాయం ఉంటుందా.? ఇదిగో క్లారిటీ..
Telangana: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా.?