
హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR రాజ్యాంగంం వ్యాఖ్యలపై శుక్రవారం నాడు BJP నేతలు New delhi లో పాదయాత్రలు నిర్వహించనున్నారు.
Union Budget 2022 పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించే సమయంలో Indian Constitution ను మార్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీకి చెందిన ఎంపీలు గురువారం నాడు తెలంగాణ భవన్ లో మౌన దీక్షకు దిగాడు. కేసీఆర్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బీజేపీ నేతలు., తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు గురువారం నాడు మౌన దీక్షలు చేశారు. శుక్రవారం నాడు బీజేపీ నేతలు న్యూఢిల్లీలో Foot March నిర్వహించనున్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఆ పార్టీ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొంటారు.
Telangana రాష్ట్రంలో TRS పై బీజేపీ ఒంటికాలిపై విమర్శలు చేస్తోంది. కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలపై బీజేపీ అదను దొరికితే తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పిస్తోంది. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపర్చారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన
రాజ్యాంగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ Congress పార్టీ కూడా ఆందోళనకు దిగింది. గాంధీ భవన్ లో రెండు రోజుల పాటు దీక్షలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. నిన్న, ఇవాళ కూడా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు.
విపక్షాలకు టీఆర్ఎస్ కౌంటర్లు
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన పరిస్థితులున్నాయని కూడా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.