బతికుండగానే ఫొటో కింద కీర్తిశేషులు అని రాయించుకుని.. పూజలు చేసి.. ఆ తరువాత మనస్తాపంతో ఉరేసుకుని...

Published : Feb 04, 2022, 06:30 AM IST
బతికుండగానే ఫొటో కింద కీర్తిశేషులు అని రాయించుకుని.. పూజలు చేసి.. ఆ తరువాత మనస్తాపంతో ఉరేసుకుని...

సారాంశం

హృదయాల్ని కదిలించే ఈ ఘటన ఖమ్మంలో జరిగింది. అనారోగ్యంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి జీవించి ఉండగానే తన ఫోటో వద్ద కీర్తిశేషులు అని రాసి పెట్టుకున్నాడు. దానికి పూజలు కూడా చేశాడు. అనారోగ్యం తీవ్రం కావడంతో ఉరేసుకున్నాడు. ఖమ్మం గ్రామీణం ఏదులాపురంలో జరిగిన సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం…  

ఖమ్మం : ఇదొక విచిత్రమైన కేసు.. విషాదకరమైన విషయం.. అనారోగ్యం బతుకును దుర్భరం చేయడంతో చావాలని నిర్ణయించుకున్నాడో వ్యక్తి. అయితే చనిపోయిన తరువాత తాను అనామకంగా వెళ్లిపోవడం.. కనీసం తన ఫొటోకు కూడా బొట్టు పెట్టే దిక్కులేని అనాథగా ఉండకూడదనుకున్నాడు. అందుకే బతికుండగానే ఫొటో ఫ్రేమ్ కట్టించుకుని.. పూజలు చేసి మరీ ఉరేసుకుని చనిపోయాడు. 

గుండెల్ని కదిలించే ఈ ఘటన ఖమ్మంలో జరిగింది. Illnessతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి జీవించి ఉండగానే తన ఫోటో వద్ద కీర్తిశేషులు అని రాసి పెట్టుకున్నాడు. దానికి పూజలు కూడా చేశాడు. అనారోగ్యం తీవ్రం కావడంతో ఉరేసుకుని suicide చేసుకున్నాడు. ఖమ్మం గ్రామీణం ఏదులాపురంలో జరిగిన సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం…

తమిళనాడుకు చెందిన వాడపల్లి శివప్రసాద్ (48).. 30 ఏళ్ల క్రితం రాష్ట్రానికి వలస వచ్చాడు. కొన్నాళ్ళు విజయవాడ, ఖమ్మంలో ఉన్నాడు. ప్రస్తుతం ఎదులాపురం వెంపటి నగర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.  సమీప కోదాడ అడ్డరోడ్డులోని హోటల్ లో Cooking Master గా పని చేస్తున్నాడు. ఈనెల 1న ఇంట్లోకి వెళ్లిన శివప్రసాద్ ఆ తర్వాత ఇంటి యజమాని కంటబడలేదు. గురువారం ఉదయం కూడా ఎంతకీ తలుపు చేయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీల్లోంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. 

వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంకర్రావు తెలిపారు. శివప్రసాద్ కొంతకాలంగా తీవ్ర Headacheతో బాధపడుతున్నాడు. ఆ బాధ తట్టుకోలేక చనిపోవాలనుకున్నాడు. తన ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇదిలా ఉండగా, పెద్దపల్లిలో Extra dowry కోసం అత్తింటి వేధింపులు భరించలేక పసికందుతో సహా బావిలో దూకి ఓ తల్లి suicideకు పాల్పడింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం… ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన చిగుర్ల రమేష్ కు జూలపల్లికి చెందిన మౌనికతో 3 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి కూతురు జున్ను (18 నెలలు) ఉంది. ప్రస్తుతం మౌనిక ఆరు నెలల Pregnant.  పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న రమేష్ కుటుంబంతో కలిసి పెద్దపల్లి లో ఉంటున్నాడు.

వివాహ సమయంలో మౌనిక పుట్టింటివారు రూ. 30 లక్షల నగదు, 20 తులాల బంగారం అప్పగించారు. అయినా..  కొంతకాలంగా అదనపుకట్నం కోసం మౌనికను అత్తింటివారు వేధిస్తున్నారు. మంగళవారం రాత్రి భర్త రమేష్,  అత్త లక్ష్మి మౌనికతో గొడవ పెట్టుకున్నారు. ఈ విషయం  పుట్టింట్లో చెప్పలేక తీవ్ర మనోవేదనకు గురైన మౌనిక..  బుధవారం ఉదయం కూతుర్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయమై రమేష్ తన తన బావమరిది( మౌనిక సోదరుడు)బండారి రమేష్ కు సమాచారం  అందించాడు. ఆయన పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వారు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా... మౌనిక బిడ్డతో కలిసి ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలోని రోడ్డు మీదుగా వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీసులు అటువైపు తనిఖీలు జరిపి చెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో తల్లీ కూతుళ్ల మృతదేహాలను గుర్తించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్ పరిశీలించారు.  మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త చిగుళ్ల రమేష్,  అత్త లక్ష్మి మీద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?