హైదరాబాద్ పోలీసుల కొత్త వార్ రూమ్ అద్భుతమైన, అధునాతన, సాంకేతికత హంగులతో సిద్ధమైంది. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు లక్ష సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించి రియల్ టైమ్‌లో ప్రతి వాహనం కదలికలను కనిపెట్టే వ్యవస్థ ఇందులో ఉన్నది. అత్యవసరాల్లో చాపర్లు ల్యాండ్ కావడానికి భవనం పైన హెలిప్యాడ్ నిర్మించారు.
హైదరాబాద్: హైదరాబాద్ ఇంటిగ్రెటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) అధునాతన సాంకేతికతతో సిద్ధమైంది. అమెరికాకు పెంటగాన్ మిలిటరీ కమాండ్ సెంటర్‌ను గుర్తు తెచ్చేలా ఈ కొత్త వార్ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు ఒక లక్ష కెమెరాలు, రియల్ టైమ్‌లో ట్రాఫిక్‌ను పర్యవేక్షించే వ్యవస్థ, ఒక హెలిప్యాడ్ వంటి సదుపాయాలను ఈ వార్ రూమ్ కలిగి ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఈ రోజు ఐసీసీసీకి అదనపు విభాగాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ పోలీసు కమషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించిన ఐసీసీసీని అధునాతన , సాంకేతిక హంగులతో సిద్ధం చేశారు.
ఈ భవనంపైన హెలిప్యాడ్‌ను కూడా నిర్మించారు. అత్య వసర సమయాల్లో హెలికాప్టర్లు ఇక్కడ ల్యాండ్ కావొచ్చు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు ఒక లక్ష కెమెరాలను పర్యవేక్షించే ఒక వీడియో సర్వెలెన్స్ సిస్టమ్‌ను ఇందులో ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఏ చోటనైనా ఒక వాహనాన్ని రియల్ టైమ్‌లో దాని కదలికలను ఈ మెకానిజం ద్వారా గమనించవచ్చు.
వాతవరణాన్ని అంచనా వేసే వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. తీవ్ర వాతావరణ పరిస్థితులను ఈ వ్యవస్థ ముందస్తుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. విపత్తు నిర్వహణను ఇది మరోస్థాయికి తీసుకెళ్లుతుంది. అలాగే.. వరదలు, భూకంపాలు, కార్చిచ్చు వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహకారాలను సమన్వయం చేసే వ్యవస్థ కూడా ఐసీసీసీలో ఉండటం గమనార్హం.
Also Read: MLC: గవర్నర్ తమిళిసై పై ఎమ్మెల్సీ మధుసూదనాచారి.. ‘ఆ అధికారం గవర్నర్‌కు లేదు’
హైదరాబాద్ ఐసీసీసీని సీఎం కేసీఆర్ గతేడాది ఆగస్టులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టింది. టవర్ ఏ 19 అంతస్తులు, టవర్ బీ 15 అంతస్తులు, టవర్ సీ మూడు అంతస్తులు, టవర్ డీ రెండు అంతస్తుల భవనాలు.టవర్ ఈలో సీసీసీ నాలుగు, ఏదో అంతస్తుల్లో ఉంటుంది.
డీజీపీ చాంబర్ టవర్ ఏలోని నాలుగో అంతస్తులో ఉంటుంది. పోలీసు కమిషనర్ చాంబర్ 18వ అంతస్తులో, ఇతర ఉన్నత స్థాయి అధికారుల చాంబర్లు ఏడో ఫ్లోర్‌లో ఉంటాయి.