తాంత్రిక పూజ పేరుతో నిలువుదోపిడి: అరెస్ట్ చేసిన పోలీసులు

By rajesh yFirst Published Sep 10, 2018, 8:45 PM IST
Highlights

 అమాయకంగా ఉన్నప్రజలే అతని టార్గెట్. మానసికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఒక్కసారి అతని దగ్గరకి వచ్చారంటే ఇక చేతులు కాల్చుకోవాల్సిందే. అడిగినంత సొమ్ము ఇచ్చుకోవాల్సిందే. భస్మం పూజ చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని చెప్తూ అక్కడి నుంచి లాగడం మెుదలుపెడతాడు. చివరికి ఆ ఇల్లు గుల్లయ్యే వరకు వదలడు.

హైదరాబాద్: అమాయకంగా ఉన్నప్రజలే అతని టార్గెట్. మానసికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఒక్కసారి అతని దగ్గరకి వచ్చారంటే ఇక చేతులు కాల్చుకోవాల్సిందే. అడిగినంత సొమ్ము ఇచ్చుకోవాల్సిందే. భస్మం పూజ చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని చెప్తూ అక్కడి నుంచి లాగడం మెుదలుపెడతాడు. చివరికి ఆ ఇల్లు గుల్లయ్యే వరకు వదలడు. 

వాళ్లు మాకు ఏ పూజలు వద్దు అని చెప్పినా అయితే అరిష్టం అంటూ భయపెడతాడు. చివరికి మంత్రాలకు చింతకాయలు రాలవు అని తెలుసుకునేసరికి బాధితులు సర్వం కోల్పతారు. తాంత్రిక మంత్రాల పూజతో ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ ద్వారా అతడిని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. 

వివరాల్లోకి వెళ్తే జనగాం జిల్లా చిల్పూర్ మండలం శ్రీపథపల్లి గ్రామానికి చెందిన గెడ్డమం శివకుమార్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాంత్రిక పూజల పేరుతో అందర్నీ బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటాడు. చిన్నతనంలోనే చదవును మద్యలో ఆపేసిన శివకుమార్ తాంత్రిక విద్యలపై ఆసక్తి చూపాడు. తాంత్రిక విద్యపై ఆసక్తితో నాసిక్ వెళ్తూ ఉండేవాడు. 

నాసిక్ కు చెందిన ఈశ్వర్ కోషి మరియు విజయవాడకు చెందిన గండ్రకోట ఫణీంద్రలను గురువులుగా భావించాడు. వాళ్ల దగ్గర నుంచి అమాయక ప్రజలను మంత్రాల పేరుతో ఎలా బురిడీ కొట్టించాలో నేర్చుకున్నాడు. ఈ ముగ్గురు అస్సాంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి తాంత్రిక పూజలు, యజ్ఞాల పేరుతో దోచుకునేవారు. 

మానసిక సమస్యలు, రుగ్మతలు, నిరాశ నిస్ప్రహలతో ఉంటున్న వారి సమస్యలను తాంత్రిక విద్యతో దూరం చేస్తానని హామీ ఇస్తాడు. అలా హామీ ఇచ్చి వారి దగ్గర నుంచి వేలకు వేలు వసూలు చేస్తుంటాడు.  వచ్చిన వ్యక్తి ధనవంతుడు అయితే ఒకరేటు పేదవాడైతే మరో రేటు ఉంటుంది. మెుదట భస్మం పూజతో ప్రారంభిస్తాడు. అందుకు 10వేల రూపాయలు తీసుకుంటాడు. ఇది అంతా రహస్యంగా చెయ్యాలని చెప్పి రహస్యంగానే చేస్తాడు శివకుమార్. 

పూజ సమయంలో వారి ఫోటోలను ఫోన్న నంబర్లను తీసుకుని హైదరాబాద్ లోని ఒక ప్రాంతంలో పూజలు చెయ్యాలని సమాచారం ఇస్తాడు. చేయకపోతే మరింత అరిష్టం అని చెప్పడంతో వారు వచ్చి తప్పక చెయ్యాల్సిన పరిస్థితి. ఇలా తాంత్రిక విద్యల పేరుతో హౌసింగ్ బోర్డు కాలనీ, కుషాయిగూడ, నేరేడ్ మెట్, కూకట్ పల్లి ప్రాంతాల్లో ఈ విద్యలను ప్రదర్శించేవాడు.  

ధనవంతులు బాధితులుగా వస్తే చెన్నైకు చెందిన మరికొంతమంది సభ్యులతో పూజలు చేస్తూ అందినకాడికి దోచుకునేవాడు. సమాచారం అందుకున్న పోలీసులు శివకుమార్ పై దృష్టి సారించారు. ఒక ఇంట్లో భస్మం పూజ చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో డెకాయ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి పూజసామాగ్రితోపాటు అతని మెబైల్ ను స్వాధీనం చేసుకున్నారు.  
 

click me!