వదినకు రాంగ్ కాల్స్.. ప్రశ్నించినందుకు..

Published : Oct 23, 2018, 11:03 AM ISTUpdated : Oct 23, 2018, 11:14 AM IST
వదినకు రాంగ్ కాల్స్.. ప్రశ్నించినందుకు..

సారాంశం

శ్రవణ్ కొంతకాలంగా విక్కి అన్న భార్య(వదిన)కు రాంగ్ కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. ఈ విషయం పై తేల్చుకునేందుకు విక్కీ తన స్నేహితులతో శ్రవణ్ ఇంటికి వెళ్లి అతనిని నిలదీశాడు.   

తన అన్న భార్య(వదిన)కు రాంగ్ కాల్స్ చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించాడు. ఈ విషయంలో మాటామాటా పెరిగి.. చివరకు ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ఈ సంఘటన  జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని యాప్రాల్‌ జెజె నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాప్రాల్‌లోని ఇందిరానగర్‌ చెందిన జైకుమార్‌ మీరాభాయ్‌కి ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు విక్రమ్, మరో కుమారుడు విక్కి అలియాస్‌ చెన్నారెడ్డి(29)లు ఆదివారం రాత్రి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గా మాత విగ్రహా ఊరేగింపునకు వెళ్లారు.

అనంతరం విక్రమ్‌ ఇంటికి తిరిగి రాగా విక్కి తన స్నేహితులు జోసఫ్, క్రిష్ణ, వికాస్‌తో కలిసి జెజెనగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ ఇంటికి వెళ్లాడు. శ్రవణ్ కొంతకాలంగా విక్కి అన్న భార్య(వదిన)కు రాంగ్ కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. ఈ విషయం పై తేల్చుకునేందుకు విక్కీ తన స్నేహితులతో శ్రవణ్ ఇంటికి వెళ్లి అతనిని నిలదీశాడు. 

ఈ విషక్ష్ంలో  ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.. దీంతో విక్కి.. శ్రావణ్‌ తలపై కొట్టడంతో అతడికి గాయమైంది. కోపోద్రిక్తుడైన శ్రవణ్ ఇంట్లోకి వెళ్లి కూరగాయల కోసే కత్తి తీసుకువచ్చి విక్కీపై దాడి చేయడంతో అతను కుప్పకూలాడు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన వికాస్‌పై కూడా దాడి చేశాడు. దీంతో అతను విక్కి సోదరుడు విక్రమ్‌కు సమాచా రం అందించడంతో విక్రమ్‌ అక్కడికి చేరుకున్నా డు. ఆగ్రహంతో ఉన్న శ్రవణ్‌ అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. విక్కీని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతిచెందాడు.

సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు విక్కి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విక్రమ్,వికాస్‌లను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.  సంఘ టనా స్ధలాన్ని మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, జవహర్‌నగర్‌ సీఐ సైదు లు పరిశీలించారు. నిందితుడు శ్రవణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  మృతుడి తల్లి మీరాభాయ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu