ఏపీ మంత్రి భార్యకు తెలంగాణలో చేదు అనుభవం

By telugu teamFirst Published May 18, 2019, 11:38 AM IST
Highlights

ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మకు.. తెలంగాణలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఉదయం ఆమెతో టోల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు.


ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మకు.. తెలంగాణలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఉదయం ఆమెతో టోల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...

మంత్రి భార్య వెంకాయమ్మ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారులో వెళ్తున్నారు. కాగా... ఆమె వాహనాన్ని మాడ్గుల పల్లి వద్ద టోల్ ఫీజు చెల్లించాలని వారు కోరడంతో ఆమె టోల్‌గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏపీ మంత్రి భార్యని అని, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాన్ని ఎలా ఆపుతారంటూ మండిపడ్డారు. 

దీనికి టోల్‌గేట్ సిబ్బంది స్పందిస్తూ.. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నంతమాత్రాన టోల్‌ఫీజు చెల్లించనంటే కుదరదని, ఎమ్మెల్యే ప్రయాణించే వాహనానికి మాత్రమే ఆ సౌలభ్యం ఉంటుందని, ఎమ్మెల్యే కారులో ఇతరులెవరు ప్రయాణించినా ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. పైగా స్టిక్కర్ కాలపరిమితి కూడా ముగిసినందున ఫీజు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు.
 
ఈ క్రమంలోనే టోల్ సిబ్బందికి, మంత్రి భార్యకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఫీసు చెల్లిస్తేగానీ కారును ముందుకు అనుమతిచ్చేది లేదని సిబ్బంది చెప్పడంతో ఆమె రూ.56 చెల్లించి వెళ్లిపోయారు. 
 

click me!