నర్స్‌‌‌ను గర్భవతిని చేసిన డాక్టర్: అబార్షన్ చేయించుకోవాలంటూ నజరానాలు

Siva Kodati |  
Published : Jul 07, 2019, 05:12 PM IST
నర్స్‌‌‌ను గర్భవతిని చేసిన డాక్టర్: అబార్షన్ చేయించుకోవాలంటూ నజరానాలు

సారాంశం

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ ఓ పాడు పనిచేశాడు. తన వద్ద పనిచేస్తున్న నర్సును లోబరుచుకుని ఆమెను తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. కోదాడకు చెందిన భాస్కర్‌రావు అనే పేరు మోసిన వైద్యుడు ఉన్నాడు

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ ఓ పాడు పనిచేశాడు. తన వద్ద పనిచేస్తున్న నర్సును లోబరుచుకుని ఆమెను తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. కోదాడకు చెందిన భాస్కర్‌రావు అనే పేరు మోసిన వైద్యుడు ఉన్నాడు.

ఆమె భార్య కూడా డాక్టరే కావడంతో ఇద్దరు కలిసి పట్టణంలో అర్చనా నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. తన వద్ద పనిచేస్తున్న నర్స్‌పై కన్నేసిన భాస్కర్‌రావు ఆమెకు మాయమాటలు చెప్పి లైంగికంగా లోబరచుకున్నాడు.

వీలు కుదిరినప్పుడల్లా పలుమార్లు ఆమెను శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం ఆయన భార్యకు తెలియడంతో ఆమె ఆస్పత్రి నుంచి సదరు నర్స్‌ను బయటకు పంపించి వేసింది.

అయినప్పటికీ బుద్ధి తెచ్చుకోని డాక్టర్ భాస్కర్‌రావు.. నర్స్‌తో మరో చోట రహస్యంగా కాపురం పెట్టించి ఆమెతో సహజీవనం కొనసాగించాడు. ఫలితంగా నర్స్ గర్భం దాల్చింది...దీంతో అబార్షన్ చేయించుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి చేశాడు.

అందుకు ఆమె ససేమిరా అనడంతో పరిహారంగా భాస్కర్‌రావు భారీ హామీలు ఇచ్చాడు. అబార్షన్ చేయించుకుంటే రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తానని.. 100 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తానన్నాడు.

అంతేకాకుండా రూ. 3 లక్షల విలువ చేసే బంగారం కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ హామీలన్నింటిని మందులు రాసే చిటీ మీద రాసి సంతకం చేసి ఇచ్చాడు. దీంతో నర్సు అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకుంది.

కోదాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలను అబార్షన్ చేయించుకునేందుకు సంప్రదించగా.. అక్కడి డాక్టర్ అందుకు నిరాకరించారు. అసలు విషయం ఆరా తీయగా తనకు డాక్టర్ భాస్కర్ రావు రాసిచ్చిన హామీల చిట్టిన వైద్యుడికి చూపించింది.

దీంతో విషయం బయటికి పొక్కింది. సోషల్ మీడియాలో సదరు చిట్టీ వైరల్ అవ్వడంతో ఇప్పుడు కోదాడలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu