ఓయూలో రాహుల్ టూర్‌కి అనుమతికై: ర్యాలీకి ప్రయత్నించిన విద్యార్ధులు అరెస్ట్

Published : May 04, 2022, 03:22 PM ISTUpdated : May 04, 2022, 05:16 PM IST
ఓయూలో రాహుల్ టూర్‌కి అనుమతికై: ర్యాలీకి ప్రయత్నించిన విద్యార్ధులు అరెస్ట్

సారాంశం

ఉస్మానియా యూనివర్శిటీలో  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సమావేశానికి  అనుమతివ్వాలని కోరుతూ విద్యార్ధి సంఘాలు మహా ర్యాలీకి ప్రయత్నించాయి. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్ధులను అరెస్ట్ చేశారు


హైదరాబాద్:ఉస్మానియా యూనివర్శిటీలో  కాంగ్రెస్ మాజీ చీఫ్ Rahul Gandhi కి అనుమతివ్వాలని కోరుతూ NSUI సహా పలు విద్యార్ధి సంఘాలు బుధారం నాడు Maha Rallyకి ప్రయత్నించాయి. ఈ ర్యాలీ నిర్వహించిన విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీ Hyderabad రానున్నారు. Osmania university లోని ఠాగూర్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ సమావేశానికి Congress  పార్టీ ప్లాన్ చేసింది. అయితే ఈ సమావేశానికి ఉస్మానియా వీసీ అనుమతిని నిరాకరించారు. ఓయూలో రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలో తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా రాహుల్ మీటింగ్ కు అనుమతి ఇవ్వడం లేదని వీసీ Ravinder ప్రకటించారు.

అయితే రాహుల్ విద్యార్ధులతో సమావేశం కానున్నారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.ఈ సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదని కూడా  ఆ పార్టీ తేల్చి చెప్పింది.  ఎన్ఎస్‌యూఐతో పాటు లెప్ట్ వింగ్ విద్యార్ధి సంఘాలు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. మహా ర్యాలీకి ప్రయత్నించిన విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఓయూలో రాహుల్ గాంధీ పర్యటన విషయమై ఓయూ విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించాలని హైకోర్టు రెండు రోజుల క్రితం వీసీ రవీందర్ ను ఆదేశించింది. అయితే రెండు రోజులుగా వీసీ అందుబాటులో లేరని తెలుస్తుంది. దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్శిటీకి తీసుకు రావాలని  కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది.మరోవైపు రాహుల్ గాంధీ ఓయూకి వస్తే అడ్డుకొంటామని టీఆర్ఎస్ అనుబంధ విద్యార్ధి సంఘం కూడా ప్రకటించింది. 

ఈ నెల 6వ తేదీన రాహుల్ గాంధీ Warangal లో జరిగే  సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ  రైతులకు ఏం చేయనుందనే విషయాలను ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ వివరించనున్నారు. వరంగల్ డిక్లరేషన్ ను రాహుల్ ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ హాయంలో రైతులకు ఏం చేశారనే విషయాలపై కూడా రాహుల్ వివరించనున్నారు.

రాహుల్ గాంధీ రెండ రోజుల  తెలంగాణ టూర్ ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ  ప్లాన్ చేసింది. వరంగల్ సభకు భారీగా జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వరంగల్ సభ తర్వాత హైద్రాబాద్ లో రాహుల్ గాంధీ బిజీ బిజీగా పాల్గొంటారు.  రాహుల్ గాంధీ ఓయూ టూర్ విసయమై ఇంకా స్పష్టత రాలేదు.  కానీ ఓయూకి రాహుల్ గాంధీని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న