భగత్ అనే నేను...: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన నోముల (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 12, 2021, 11:31 AM IST
Highlights

ఇటీవల నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలుపొందిన నోముల భగత్ తో ఇవాళ అసెంబ్లీ స్పీకర్ పోచారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. 

హైదరాబాద్:  ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి నోముల భగత్ ఎమ్మెల్యేగా ఎన్నికయిన విషయం తెలిసిందే. ఇలా ఎమ్మెల్యేగా ఎన్నికైనా నోముల భగత్ గురువారం స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం  ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

వీడియో


గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ స్థానంలో ఉపఎన్నిక జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీ నోముల తనయుడు భగత్ నే ఈ ఎన్నికల బరిలోకి దింపింది. ఈ యువకుడు కాంగ్రెసు దిగ్గజం జానారెడ్డికి షాక్ ఇచ్చారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో నోముల భగత్ ప్రత్యర్థి జానారెడ్డిపై 18 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక బిజెపి పరిస్థితి మరీ దయనీయం... కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయింది. 

టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు సిఎం కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సిఎం కేసీఆర్ మరోసారి గుర్తుచేశారు.   

 ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా.. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించారన్నారు.  రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టిఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని సిఎం తెలిపారు.

నోముల భగత్ కు సిఎం కెసిఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్ కు సిఎం సూచించారు. నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం అభినందనలు తెలిపారు. 
 

click me!