ఎలాంటి బ్లాక్స్ లేవు: కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ టెస్టు తర్వాత డాక్టర్ ఎంవీ రావు

Published : Mar 11, 2022, 12:51 PM ISTUpdated : Mar 11, 2022, 12:56 PM IST
ఎలాంటి బ్లాక్స్ లేవు: కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ టెస్టు తర్వాత డాక్టర్ ఎంవీ రావు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని తేలిందని సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. ఇవాళ సీఎం కేసీఆర్ యశోధ ఆసుపత్రిలో పలు పరీక్షలు చేయించుకొన్నారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR  కు Angiogram test పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షల్లో ఎలాంటి ఇబ్బంది లేదని తేలిందని యశోద ఆసుపత్రి డాక్టర్ ఎంవీ రావు చెప్పారు.

స్వల్ప అస్వస్థతకు గురైన తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు Yashoda ఆసుపత్రికి చేరుకున్నారు. యశోద ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ తో పాటు CT Scan స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించారు. యాంజియోగ్రామ్ పరీక్షల్లో  ఎలాంటి బ్లాక్స్ లేవని తేలిందని వైద్యులు తేల్చి చెప్పారు. రెండు రోజులుగా  నీరసంగా ఉన్నట్టుగా సీఎం వైద్యులకు తెలిపారు. మరో వైపు  ఎడమ చేయి లాగుతున్నట్టుగా కేసీఆర్ వైద్యులకు చెప్పారు. దీంతో సీఎం కేసీఆర్ కు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని వైద్యులు నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగానే యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ఇతర అవసరమైన పరీక్షలు నిర్వహించనున్నారు. మరో వైపు సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని  వైద్యులు చెప్పారు. పరీక్షలు పూర్తైన తర్వాత సీఎం కేసీఆర్  ప్రగతి భవన్ కు వెళ్లే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురై యశోద ఆసుపత్రికి  చేరిన విసయం తెలుసుకొన్న వెంటనే అసెంబ్లీలో ఉన్న  మంత్రులు KTR, Harish rao, ఎమ్మెల్సీ Kavitha, మనమడు హిమాన్ష్ తదితరులు హుటాహుటిన యశోద ఆసుపత్రికి  వచ్చారు.

సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.  ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి  ఇబ్బందులు లేవని తేలిందని కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ MV Rao తెలిపారు.ముందు జాగ్రత్తగానే ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. ఎడమ కాలు, ఎడమ చెయ్యి నొప్పిగా ఉందని చెప్పడంతో ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. రెండు రోజులుగా నీరసంగా ఉన్నట్టుగా కేసీఆర్ తమకు చెప్పారని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. 

సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ చికిత్సకు రావడంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో సాధారణ వాహనాలకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వడం లేదు.


 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu