రేవంత్‌తో గ్యాప్ లేదు: కాంగ్రెస్ సీనియర్ల భేటీపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 5, 2022, 3:32 PM IST

తనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


హైదరాబాద్:తనకు టీసీసీసీ చీఫ్ Revanth Reddy కి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మాజీ ఎమ్మెల్యే P.Vishnu Vardhan Reddy,చెప్పారు. మంగళవారం నాడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి Delhiలో ఉండడం వల్ల ఇవాళ తాను నిర్వహించిన సమావేశానికి  రావడం లేదన్నారు.

 Hyderabad నగరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల నేతలంతా తాను పిలిచిన లంచ్ భేటీకి రానున్నారని ఆయన చెప్పారు. తన సోదరి Congress పార్టీలో చేరే విషయమై పార్టీ నేతలు ఎవరూ కూడా తనతో చర్చించలేదన్నారు.  

Latest Videos

undefined

తన సోదరి విషయంలో పార్టీ కార్యకర్తలు ఎలా చెబితే అలా చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తమకు బాస అని ఆయన చెప్పారు.  తాను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నానని చెప్పారు. PJR పేరు వాడుకొని కొందరు రాజకీయం చేయాలనుకుంటున్నారన్నారు. 

ప్రతిఏటా పార్టీకి చెందిన సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలతో లంచ్ భేటీ నిర్వహిస్తామన్నారు.ఇందులో భాగంగానే ఇవాళ కూడా లంచ్ భేటీ నిర్వహిస్తున్నట్టుగా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులమని పీజేఆర్ తనయుడు  విస్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. తాను టీఆర్ఎస్, బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు.పీజేఆర్ రాజకీయ వారసులు ఆయనతో నడిచిన కార్యకర్తలేనని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. 

విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ మీట్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సమావేశానికి తనతో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కూడా ఆహ్వానం ఉందన్నారు. తాము ఢిల్లీలో ఉన్నందున  ఈ  భేటీకి వెళ్లలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో లంచ్ భేటీపై మీడియా చిలువలు పలువలు చేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టించవద్దని కూడా రేవంత్ రెడ్డి కోరారు

తన సోదరి విజయా రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి లంచ్ భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

click me!