తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేశారు.. కబ్జాలు చేస్తే సీఎం చర్యలు తీసుకుంటారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Published : Jul 05, 2022, 02:32 PM ISTUpdated : Jul 05, 2022, 02:39 PM IST
తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేశారు.. కబ్జాలు చేస్తే సీఎం చర్యలు తీసుకుంటారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సారాంశం

టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేశారని అన్నారు.

టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేశారని అన్నారు. ఆయన చెప్పినట్టుగా భుకబ్జాలు చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. భూకబ్జాలు చేసేవారిపై సీఎం చర్యలు తీసుకుంటారని తెలిపారు. తీగల కృష్ణారెడ్డి అలా ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. ఆయనను ఎవరైనా తప్పుదోవ పట్టించి ఉంటే.. దీనిపై కచ్చితంగా మాట్లాడుకుంటామని  తెలిపారు. 

ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌పై  తీగల కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మీర్‌పేట్‌ను సబితా ఇంద్రా రెడ్డి నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మీర్‌పేట్‌ను నాశనం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోనని చెప్పారు. మీర్పేట మంత్రాల చెరువును తీగల కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. మంత్రి సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చెరువులు, పాఠశాల స్థలాలను వదలడం లేదని విమర్శించారు. 

Also Read: మంత్రి సబిత మీర్‌పేట్‌ను నాశనం చేస్తున్నారు.. సీఎంతో మాట్లాడుతా: తీగల కృష్ణా రెడ్డి ఫైర్

నియోజకవర్గంలో అభివృద్దిని మంత్రి సబిత గాలికొదిలేశారని తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. మీర్‌పేట కోసం అమరణ నిరహార దీక్ష చేస్తానని చెప్పారు. తమ పార్టీ నుంచి సబితా ఇంద్రా రెడ్డి గెలవలేదని గుర్తుచేశారు. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడనని చెప్పారు. ఇక, గత కొంతకాలంగా సబితా ఇంద్రారెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!