తెలంగాణలో లాక్‌డౌన్: ఏపీ వాహనాలకు నో ఎంట్రీ, అత్యవసర వాహానాలకు పర్మిషన్

By narsimha lodeFirst Published May 12, 2021, 1:12 PM IST
Highlights

 తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ నుండి వచ్చే వాహనాలను  సరిహద్దుల్లోనే తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ నుండి వచ్చే వాహనాలను  సరిహద్దుల్లోనే తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ ను అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం లాక్‌డౌన్ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చారు.

also read:తెలంగాణలో అమల్లోకి లాక్‌డౌన్: రోజూ 4 గంటలు మినహాయింపు

ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.   ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలను వెనక్కి పంపుతున్నారు. అంబులెన్స్ లతో పాటు నిత్యావసర సరుకులకు అనుమతి ఇస్తున్నారు. మరోవైపు అనుమతి ఉన్న వాహానాలను  రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని రామాపురం వద్ద ఏపీ నుండి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపుతున్నారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుతిస్తున్నారు. కర్నూల్, గద్వాల జిల్లా సరిహద్దుల్లో ఉన్న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కూడ తెలంగాణ పోలీసులు ఇదే పద్దతిని అవలంభిస్తున్నారు. 

click me!