ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దు:ట్విస్టిచ్చిన మంత్రి సబితా

By narsimha lodeFirst Published Jun 9, 2021, 4:16 PM IST
Highlights

ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై  ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 
 

హైదరాబాద్: ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై  ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారంనాడు వికారాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటర్ సెకండియర్  పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ఇవాళ ఉదయం నుండి మీడియాలో వార్త కథనాలు ప్రసారమయ్యాయి. ఈ విషయమై ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం సాగింది. 

also read:కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు

ఇంటర్ సెకండియర్ పరీక్షలపై సమీక్ష నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకొంటామని ప్రకటించారు. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయమై చర్చించారు. అయితే కేబినెట్ భేటీ తర్వాత ఇంటర్ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై సమీక్ష నిర్వహించిన తర్వాతే ప్రకటన చేస్తామని మంత్రి సబితా ప్రకటించారు.కరోనా కారణంగా టెన్త్ పరీక్షలను  రద్దు చేసింది ప్రభుత్వం. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

click me!