చట్టానికి ఎవరూ అతీతులు కాదు: తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ

By narsimha lode  |  First Published Aug 24, 2022, 9:22 PM IST

చట్టానికి ఎవరూ కూడా అతీతులు కాదని తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. చట్టాన్ని ఎవరూ కూడా తమ చేతుల్లోకి తీసుకోవద్దని కూడా  ఆయన హెచ్చరించారు. 


హైదరాబాద్:చట్టానికి ఎవరూ కూడ అతీతులు కాదని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. బుధవారం నాడు రాత్రి తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలపై రాజీ లేదని ఆయన తేల్చి చెప్పారు.రాజాసింగ్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు.రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియో  హైద్రాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. దీంతో రాజాసింగ్ ను పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ వీడియో విషయమై పలు పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు అందాయి. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నాంపల్లి కోర్టు బుధవారం నాడు సాయంత్రం  బెయిల్ మంజూరు చేసింది. 

Latest Videos

undefined

రెండు రోజులుగా హైద్రాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఇందుకు కారణమైంది. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలున్నాయని ఎంఐఎం ఆరోపిస్తుంది.ఈ విషయమై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తుంది. సోమవారం నాడు రాత్రి నుండి ఈ ఆందోళనలు సాగుతున్నాయి. మంగళవారం నాడు సాయంత్రం  నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు ఉదయం కూడా పాతబస్తీలో ఆందోళనలు సాగాయి. ఇవాళ రాత్రి కూడా కొన్ని చోట్ల ఆందోళనలు సాగిన విషయం తెలిసిందే.  పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ర్యాపిడ్ యాక్షన్  ఫోర్స్ ను పోలీసులు రంగంలోకి దించారు. 

రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.  తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సహా  పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

click me!