దిశ కేసు... నిందితుల శరీరాల్లో ఒక్క బులెట్ కూడా లేదా..?

By telugu teamFirst Published Dec 11, 2019, 7:56 AM IST
Highlights

ఘటన సమయంలో 10 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు ఉండగా.. ఇద్దరి నుంచి నిందితులు తుపాకులు లాక్కొన్నారు. మిగతా 8 మంది పోలీసులు ఆ నలుగురిపై కాల్పులు జరిపారు. అయితే.. ఎవరి తూటాలతో నిందితులు మరణించారనేది తేలాల్సి ఉంది. మృతుల శరీరాల్లోంచి తూటాలు లభ్యమైఉం టే వాటి నంబర్ల ఆధారంగా ఎవరు కాల్చారో గుర్తించవచ్చు. 
 

దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై పెద్ద చర్చే జరుగుతోంది. ఆమెను వాళ్లు అతి కిరాతకంగా వేధించి అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశారు. కాగా.. ఈ విషయం బయటకు రాగానే..  నిందితులను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఎన్ కౌంటర్ పై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ మానవహక్కుల సంఘం వ్యతిరేకించింది. ఈ క్రమంలో... దీనికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

AlsoRead దిశ తండ్రికి బదిలి... ఆమె సోదరికి కూడా......

పోలీసులు నిందితులపై ఎన్ కౌంటర్ జరపగా...  కాల్చిన తూటాల్లో నాలుగు ఆరిఫ్‌ శరీరంలోకి, శివ, చెన్నకేశవులుకు మూడు చొప్పున, ఒక బుల్లెట్‌ నవీన్‌ శరీరంలోకి దూసుకుపోయాయి. అయితే.. పోస్టుమార్టం నివేదిక లో వారి శరీరాల్లో ఎలాంటి తూటాలు లభ్యమవ్వలేదు. అవి వారి శరీరాల్లోకి చొచ్చుకుని, బయటకు దూసుకెళ్లినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటన సమయంలో 10 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు ఉండగా.. ఇద్దరి నుంచి నిందితులు తుపాకులు లాక్కొన్నారు. మిగతా 8 మంది పోలీసులు ఆ నలుగురిపై కాల్పులు జరిపారు. అయితే.. ఎవరి తూటాలతో నిందితులు మరణించారనేది తేలాల్సి ఉంది. మృతుల శరీరాల్లోంచి తూటాలు లభ్యమైఉం టే వాటి నంబర్ల ఆధారంగా ఎవరు కాల్చారో గుర్తించవచ్చు. 

కానీ.. తూటాలు వారి శరీరాల్లోంచి బయటకు దూసుకుపోవడంతో ఘటనాస్థలిలో లభించే ఆధారాలపైనే ఆ తూటాలు ఎవరి తుపాకీలోంచి వచ్చాయో తేలనుంది. దీంతోపాటు.. పోలీసులు ఎన్ని రౌండ్ల తూటాలు కాల్చారో లెక్క తేలాలి. ఈ వివరాలను అధికారికంగా బెల్‌ ఆఫ్‌ ఆర్మరీ(ఆయుధాగారం)లోని రికార్డుల ఆధారంగా తెలుసుకోవచ్చు. క్లూస్‌టీం ఇప్పటికే ఘటనాస్థలిలో లభించిన బుల్లెట్లు, వాటి క్యాప్స్‌ను బాలిస్టిక్‌ విశ్లేషణ జరుపుతోంది. దీంతోపాటు.. ఆరిఫ్‌, చెన్నకేశవులపై ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారో లెక్క తేలాల్సి ఉంది.

ఇదిలా ఉండగా...ఎన్ హెచ్ఆర్సీ.. ఈ ఎన్ కౌంటర్ విషయంపై పోలీసులను విచారిస్తోంది. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం పోలీసులు నిందితులను రెండు రోజులు బయటకు తీసుకువెళ్లారు. ఆ రెండు రోజులు అసలు ఏం జరిగింది.. ఎన్ కౌంటర్ చేయాల్సిన  పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలను ఆరా తీస్తున్నారు. 

click me!