దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ్, కుల అహంకారంతో దాడి: కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్

By narsimha lode  |  First Published Nov 18, 2022, 1:48 PM IST

తన తల్లిని  భయబ్రాంతుల్ని  గురి చేసే హక్కు టీఆర్ఎస్ కు  ఎవరిచ్చారని  నిజామాబాద్ ఎంపీ  అరవింద్  ప్రశ్నించారు.  కవిత  ఇంత రియాక్ట్  అవుతుంటే  ఈ  ప్రచారంలో  వాస్తవం  ఉందనిపిస్తుందన్నారు. 


నిజామాబాద్: కుల  అహంకారంతో తన ఇంటిపై  దాడి చేశారని నిజామాబాద్  ఎంపీ  అరవింద్  చెప్పారు. దమ్ముంటే  తనపై  వచ్చే  ఎన్నికల్లో  పోటీ చేయాలని  కవితకు  ఆయన సవాల్  విసిరారు. శుక్రవారంనాడు  నిజామాబాద్ ఎంపీ  అరవింద్ మీడియాతో  మాట్లాడారు.ఇంకా  దొరలపాలన  సాగుతుందని  అనుకొంటున్నారా  అని  ఆయన ప్రశ్నించారు. 

  హైద్రాబాద్  లోని  తన  ఇంటిపై టీఆర్ఎస్  శ్రేణులు దాడి చేసి  మహిళలను  భయపెట్టారన్నారు.  తన తల్లిని బెదిరించారని  ఎంపీ ఆరవింద్ ఆరోపించారు.నిజామాబాద్  పార్లమెంట్ లో  పోటీచేస్తావా  చేయాలని  కవితకు  అరవింద్  సవాల్  చేశారు. విమర్శలు  చేస్తే దాడి చేస్తారా  అని  అరవింద్  ప్రశ్నించారు.  గత  పార్లమెంట్  ఎన్నికల సమయంలో  పోటీచేసిన  178  మందిలో  71 మంది  పసుపు రైతులు బీజేపీలో చేరారన్నారు.  తనపై  చీటింగ్  కేసు  ఏం వేస్తావని  ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్  అని అరవింద్  విమర్శించారు.  కేసీఆర్ పై చీటింగ్  కేసు  పెట్టాలని కవితకు  సలహా  ఇచ్చారు  ఎంపీ అరవింద్. మీ  నాన్న  ఇంటిని ధ్వంసం  చేయాలన్నారు. రైతులు  గుంపులు గుంపులుగా  బీజేపీలో చేరుతున్నారన్నారు.70 ఏళ్ల  వయస్సున్న తన తల్లిని   భయపెట్టే  హక్కు  ఎవరిచ్చారని  అరవింద్  ప్రశ్నించారు.  

Latest Videos

undefined

also  read:తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడుతా: నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్

కేసీఆర్, కేటీఆర్,  కవితకు  కుల  అహంకారం  ఉందన్నారు.  కుల  అహంకారంతోనే  ఇవాళ  తన  ఇంటిపై దాడికి  దిగారని అరవింద్  విమర్శించారు.  కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు  ఖర్గేతో  మాట్లాడినట్టుగా  తనకు  ఎఐసీసీ  సెక్రటరీ  ఫోన్ చేసి చెప్పారన్నారు.  అదే విషయాన్ని  తాను  మీడియాలో  మాట్లాడినట్టుగా  అరవింద్  తెలిపారు.  ఈ  వ్యాఖ్యల్లో  తప్పేం ఉందో  చెప్పాలన్నారు.  బీజేపీలో చేరాలని  కవితను  కూడా  అడిగినట్టుగా  కేసీఆర్  వ్యాఖ్యలు చేయలేదా  అని  అరవింద్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను  కూడా  కొడతావా  అని  అరవింద్  అడిగారు. ఇంతగా  రియాక్ట్  అవుతున్నారంటే  ఇందులో నిజముందని  అనుకొంటున్నానని అరవింద్  తెలిపారు. కవితపై తాను  అనుచిత  వ్యాఖ్యలు  ఏం చేశానో  చెప్పాలని అరవింద్  కోరారు.  కాంగ్రెస్  అధిష్టానానికి  చెందిన  కీలక  నేతలతో  కవిత  మాట్లాడిన  ఫోన్  కాల్ నిజమో  కాదో  తెలాల్సిన  అవసరం ఉందన్నారు.

తన  ఇంటిపై  దాడి  విషయమై  పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏం చేయకుండా  వదిలిపెట్టబోమని  అరవింద్  తెలిపారు. ఏం చేయాలో  అది సమయానికి  చేస్తామని  అరవింద్  చెప్పారు.  మోడీ తెలంగాణకు  వచ్చిన  వేలు  చూపించి వెళ్లిన  విషయాన్ని  అరవింద్  ప్రస్తావించారు. తమకు  అన్ని పార్టీలతో  తమకు  స్నేహితులుంటారని  ఆయన  చెప్పారు. 

click me!