నిజామాబాద్ నుంచి కాశీయాత్రకు వెళ్లిన బస్సు బోల్తా, ఒకరు మృతి...

Published : May 25, 2022, 07:48 AM IST
నిజామాబాద్ నుంచి కాశీయాత్రకు వెళ్లిన బస్సు బోల్తా, ఒకరు మృతి...

సారాంశం

నిజామాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తీర్థయాత్రలకు వెళ్లిన బస్సు బోల్తా పడడంతో అందులోని ఒకరు మృత్యువాత పడగా మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. 

నిజామాబాద్ : Nizamabad జిల్లా నుంచి Kashi Yatraకు వెళ్లిన Bus accidentకి గురైంది. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో యాత్రికులతో కూడిన బస్సు బోల్తా పడిన ఘటనలో నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామానికి చెందిన సరళ (70) మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఔరంగాబాద్ పట్టణంలో చికిత్స అందిస్తున్నారు. ఈనెల 24న 38 మంది యాత్రికులతో కూడిన ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి బయలుదేరింది. బస్సులో నిజామాబాద్ జిల్లా వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్ తో పాటు నిర్మల్ జిల్లా బాసర కు చెందిన యాత్రికులు ఉన్నారు. ఔరంగాబాద్ లో ఓ హోటల్ వద్ద బస్సు ఆపుతుండగా వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది.

ఇదిలా ఉండగా, మే 20న kakinada జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సమీపంలో జాతీయ రహదారిమీద Wedding bus బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పెళ్లి కొడుకు సహా 36మంది గాయపడ్డారు. బస్సు విజయనగరం నుంచి ఏలూరుకు వరుడితో మార్గమధ్యలో గండేపల్లి నీలాద్రిరావు పేట పెట్రోల్ బంక్ సమీపంలో accident జరిగింది. ఒకరిపై ఒకరు పడడంతో పెళ్లి కొడుక్కి వరుసకు పెదనాన్న అయిన గుడిపాటి వెంకట కోదండ రామయ్య అనే వ్యక్తి ఊపిరి ఆడకపోవడంతో బస్సులోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కాగా, మే 15న బీహార్ లో ఇలాంటి ఘటనే జరిగింది. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నవీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కావాల్సిన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. 

జార్ఖండ్‌లోని ఛతర్‌పూర్‌లోని సోనూతండ్ ఖతిన్ గ్రామానికి చెందిన లార్డ్ సాహు కుమారుడు ప్రకాష్ కుమార్ పెళ్లి వేడుక శనివారం రాత్రి ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ బ్లాక్‌లోని తోల్ పంచాయతీలో జరిగింది. ఈ పెళ్లి ఊరేగింపులో పాల్గొన వరుడి తరఫువారు ఏడుగురు.. వేడుకలు ముగించుకుని ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కారులో పాలము జిల్లాకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు బాఘి గ్రామ సమీపంలో ఉన్న నది వంతెన సమీపంలోకి రాగానే.. అది అదుపు తప్పి రైలింగ్ ఢీకొని వంతెనపై నుంచి కిందకు పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

మృతులను జార్ఖండ్‌లోని పాలము జిల్లా నివాసితులైన రంజిత్ కుమార్, అభయ్ కుమార్, అక్షయ్ కుమార్, శుభం కుమార్, బబ్లు కుమార్‌గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జౌరంగాబాద్‌కు తరలించారు. మరోవైపు గాయపడినవారిని గంజన్ కుమార్, ముఖేష్ కుమార్‌లుగా గుర్తించారు. వారికి మెరుగైన వైద్యం నిమిత్తం వారణాసికి రిఫర్ చేశారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?