ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

By narsimha lodeFirst Published May 24, 2022, 5:17 PM IST
Highlights

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్:రైతులకు ఉచిత విద్యుత్ ను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఈ పథకాన్ని TRS కొనసాగిస్తుందన్నారు.మంగళవారం నాడు హైద్రాబాద్ లో  Jagga Reddy  మీడియాతో మాట్లాడారు.. TRS ఏం చేసిందని పదే పదే అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. లక్ష రూపాయాల రైతుల రుణాలను కూడా మాఫీ చేసింది కూడా Congress పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. 

తెలంగాణ రైతులపై కాకుండా ఇతర రాష్ట్రాల రైతులపై కేసీఆర్ కు ఎందుకు ప్రేమ పుట్టిందని  జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాన రైతుల కడుపు నింపి ఇతర రాష్ట్రాల సమస్యలను పట్టించుకోవాలని KCR  కు జగ్గారెడ్డి సూచించారు. స్వంత రాష్ట్రంపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు.రెమిడెసివర్ పై అనేక నిజాలు బయటకు వస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు.,

also read:పంజాబ్‌లో కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో తెలియదు: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 22న  పంజాబ్ లో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించాడు. రైతు ఉద్యమం సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు.ఈ హామీలో భాగంగానే కేసీఆర్ రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించారు. మరో వైపు గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించింది. అయితే తెలంగాణలో రైతులను ఆదుకోకుండా ఇతర రాష్ట్రాల్లో రైతులకు ఆర్ధిక సహాయం చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ లు విమర్శలు చేస్తున్నాయి.

పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదోనని కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ విమర్శలు చేశారు. చెక్ డ్రా చేసేదాకా వాటిని తీసుకున్న లబ్దిదారులకు టెన్షనే అని అన్నారు. కేసీఆర్ ఇక్కడే ఏమీ చేయలేదని.. అక్కడకు పోయి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంపై టీఆర్ఎస్ అనుకూలమా..? కాదా..? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వాళ్లు జై హనుమాన్ అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనం అని సంజయ్ అన్నారు. 
 

click me!