అప్పుడు ఈవీఎం అన్నారు.. ఇప్పుడు చంద్రబాబు... ఎంపీ కవిత

Published : Dec 19, 2018, 12:03 PM IST
అప్పుడు ఈవీఎం అన్నారు.. ఇప్పుడు చంద్రబాబు... ఎంపీ కవిత

సారాంశం

తెలంగాణలో కాంగ్రెస్‌ ఓటమికి మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ అన్నారని...ఇవాళ చంద్రబాబును సాకుగా చూపిస్తున్నారని ఎంపీ కవిత మండిపడ్డారు. 

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నిజామాబాద్ ఎంపీ కవిత మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఓటమికి మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ అన్నారని...ఇవాళ చంద్రబాబును సాకుగా చూపిస్తున్నారని ఎంపీ కవిత మండిపడ్డారు. 

బుధవారం ఎంపీల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ నేతలు కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కూటమి హామీలను ప్రజలు విశ్వసించలేదని అన్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్