సమగ్ర సర్వేతో కేసీఆర్‌కి అందరి స్థితి అర్థమైంది: కవిత

By Siva KodatiFirst Published Feb 14, 2019, 5:41 PM IST
Highlights

వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సూచించారు నిజామాబాద్ ఎంపీ కవిత. గురువారం నిజామాబాద్‌ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 1,173 మంది వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు రూ.5.86 కోట్ల విలువైన సబ్సిడీ చెక్కులను కవిత అందజేశారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల పక్షపాతన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సమగ్ర కుటుంబ సర్వే చేయించారన్నారు. సర్వే ద్వారా రాష్ట్రంలోని అందరి స్థితిగతులను తెలుసుకున్నారన్నారు.

ప్రభుత్వ సాయం కోసం రెండు వేల మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 400 మంది మహిళలున్నారన్నారు. మహిళా దరఖాస్తుల సంఖ్య పెరిగేలా కుల సంఘాల నాయకులు సహకరించాలని కవిత విజ్ఞప్తి చేశారు.

అలాగే కులాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే.. మరింత మెరుగైన పథకాల రూపకల్పనకు అవకాశం ఉంటుందన్నారు. బీసీ విద్యార్థుల కోసం కేసీఆర్ 119 గురుకులాలను ప్రారంభించారని, మరో 119 గురుకులాలను ప్రారంభిస్తారని ఎంపీ వెల్లడించారు. 

click me!