ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

Published : Sep 02, 2018, 05:07 PM ISTUpdated : Sep 09, 2018, 12:00 PM IST
ప్రగతి నివేదన సభ: 15 నిమిషాల్లో కేటీఆర్‌కు చొక్కా కుట్టించిన టైలర్

సారాంశం

15 నిమిషాల్లోనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రగతి నివేదన సభలో మేరు సంఘం  ప్రతినిధులు  చొక్కాను కుట్టించారు.  ఈ షర్ట్‌ను కేటీఆర్  వేసుకొన్నారు. 


హైదరాబాద్: 15 నిమిషాల్లోనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రగతి నివేదన సభలో మేరు సంఘం  ప్రతినిధులు  చొక్కాను కుట్టించారు.  ఈ షర్ట్‌ను కేటీఆర్  వేసుకొన్నారు. పావుగంటలోనే తనకు  చొక్కాను కుట్టించిన మేరు సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు.

ప్రగతి నివేదన సభ ప్రాంగంణంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌ మేరు సంఘం జనరల్ సెక్రటరీ  వి. మాధవ్ కేటీఆర్ చొక్కా కొలతలు తీసుకొన్నారు.  ఎలక్ట్రానిక్ కుట్టు మిషన్ ద్వారా అక్కడికక్కడే చొక్కాను కుట్టి కేటీఆర్ కుఅందించారు. 

మేరు సంఘం ప్రతినిధులు కుట్టించిన చొక్కాను అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలోనే కేటీఆర్ వేసుకొన్నారు.  అతి తక్కువ సమయంలోనే చొక్కాను కుట్టించిన  మేరు సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు.

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం