నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం...ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తెర మరిచి

Published : Feb 09, 2019, 11:29 AM ISTUpdated : Feb 09, 2019, 11:33 AM IST
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం...ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తెర మరిచి

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వ హాస్పిటల్స్ తీరు మారడంలేదు. పేద రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అనేక ఘటనలు ఇంకా బయటపడుతూనే వున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ దవాఖానా నిమ్స్ వైద్యుల నిర్వాకం ఒకటి బయటపడింది. 

వైద్యం కోసం వచ్చిన రోగి వ్యాధిని నయం చేయాల్సింది పోయి మరింత ఎక్కువయ్యేలా చేశారు నిమ్స్ డాక్టర్లు. మూడు నెలల క్రితం మహేశ్వర్ చౌదరి అనే యువకుడు నిమ్స్ లో హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా అతడి కడుపులో ఓ సర్జికల్ కత్తెర వున్నట్లు గుర్తించారు. 

దీంతో తీవ్ర ఆగ్రహానికిగ గురైన కుటుంబ సభ్యులు,బంధువులు ఇవాళ నిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే మహేశ్వర్ మరింత అనారోగ్యంపాలయ్యాడని...వెంటనే అతడికి మళ్లీ ఆపరేషన్ చేసి కడుపులో వున్న కత్తిని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. అతడికెలాంటి హాని జరిగినా డాక్టర్లే బాధ్యత వహించాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. 

పేదరికంతో దిక్కులేక వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానాలను ఆశ్రయిస్తే పరిస్థితి ఇలా ఉందంటూ నిమ్స్ వద్ద గల  రోగులు, వారి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కూడా డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu