గల్లంతైన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహం శుక్రవారం నాడు లభ్యమైంది. రెండు రోజుల క్రితం వరదలో జమీర్ కారుతో సహా నీటిలో కొట్టుకుపోయాడు. రెండు రోజుల నుండి జమీర్ మృతదేహన్ని వెలికి తీసే ప్రయత్నాలు చేశారు. కానీ శుక్రవారం నాడు రెస్క్యూ బృందాలు జమీర్ ప్రయాణించిన కారును వెలికితీశారు.
కరీంనగర్: రెండు రోజుల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతి చెందాడు. వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తలను కవర్ చేయడానికి వెళ్లి కారుతో సహా కొట్టకుపోయిన జగిత్యాల జిల్లాకుచెందిన న్యూస్ చానెల్ రిపోర్టర్ జమీర్ మృతి చెందాడని అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు ఉదయం జమీర్ కారును వెలికి తీశారు రెస్క్కూటీమ్. రెండు రోజులుగా ఈ కారును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరద తగ్గుముఖం పట్టడంతో ఇవాళ ఉదయం కారును వరదల నుండి రెస్క్యూ బృందం వెలికి తీసింది.
జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని రామోజీపేట వద్ద రెండు రోజుల క్రితం వాగులో కారుతో సహా జమీర్ కొట్టుకుపోయాడు. ఈ కారులో ఉన్న అతని స్నేహితుడు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే జమీర్ కారులో నుండి టయుకు వచ్చే క్రమంలో వరద ప్రవాహం ఉధృతికి కారు నుండి బయటకు రాలేకపోయినట్టుగా రెస్క్కూ టీమ్ భావిస్తుంది. రెండు రోజుల క్రితం రాయికల్ మండలంలోని బోర్నపల్లి వద్ద చిక్కుకున్న వ్యవసాయ కూలీలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లారు.ఈ వార్తను కవర్ చేసి తిరుగు ప్రయాణంలో జమీర్ ప్రమాదానికి గురయ్యాడు.
undefined
త్వరగా ఇంటికి చేరేందుకు రామోజీపేట మార్గాన్ని జమీర్ ఎంచుకున్నారు. అయితే రామోజీపేట వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే వాగులో వరద నీటిని తక్కువగా అంచనా వేయడంతో ప్రమాదం చోటు చేసుకొంది. వరద మధ్యలోకి వెళ్లిన తర్వాత కారు నీటిలో నిలిచిపోయింది.దీంతో కారు డోర్ తీసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అతను స్నేహితుడు బయటకు వచ్చాడు. అతను మాత్రం కారులోనే ఉండిపోయాడు.
రాయి కల్ మండలంలోని బోర్నపల్లి గ్రామ శివారు లో గోదావరి కుర్రులో చిక్కుకున్న తొమ్మిది మంది వ్యవసాయ కూలీల వార్త కవరేజీకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎన్‌టీవీ జర్నలిస్టు జమీర్ రామోజీపేట వద్ద వాగు వరదలో గల్లంతయిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా జమీర్ ఆచూకీ కోసం రెస్క్యూ బృందం అధికారులు ప్రయత్నాలు చేశారు. నిన్న ఉదయం కారు టైర్ ను గుర్తించారు. కారును క్రేన్ సహాయంతో వెలికితీసే ప్రయత్నం చేశారు. అయితే కారుకు కట్టిన తాడు తెగడంతో కారు మరో 200 మీటర్లు వరదలోకి వెళ్లిపోయింది. ఎగువ నుండి వరద ప్రవాహం పెరడంతో కారును వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్ ఇబ్బంది పడింది. ఇవాళ ఉదయం వరద ఉధృతి తగ్గడంతో క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. కారులో జమీర్ మృతదేహం లభ్యమైంది.
జమీర్ కారు గల్లంతైన విషయం తెలుసుకొన్న కలెక్టర్ సహా అధికారులు రెస్క్యూ టీమ్ ను సంఘటన స్థలానికి పంపించి సహాయక చర్యలను పరిశీలించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ , జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. జమీర్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇవాళ సాయంత్రం జమీర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.