లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఈ-పాస్ లేక రోడ్డుపైనే నిలిచిపోయిన నవదంపతులు

By narsimha lode  |  First Published May 24, 2021, 9:28 PM IST

లాక్‌డౌన్  కొత్తగా వివాహం చేసుకొన్నవారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ పాస్ లేకపోవడంతో  నూతన వధూవరులతో పాటు వారు ప్రయాణీస్తున్న వాహనాలను కూడ నిలిపివేశారు అధికారులు.


పెద్దపల్లి : లాక్‌డౌన్  కొత్తగా వివాహం చేసుకొన్నవారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ పాస్ లేకపోవడంతో  నూతన వధూవరులతో పాటు వారు ప్రయాణీస్తున్న వాహనాలను కూడ నిలిపివేశారు అధికారులు.పెళ్లైన తర్వాత రెండు మూడు రోజుల వరకు పలు పూజా కార్యక్రమాలతొ పాటు అత్తవారింటికి వెళ్లడం సంప్రదాయం.  ఈ క్రమంలో పెళ్లైనా నవ దంపతులు అత్తవారింటికి వెళుతుంటే ఉదయం పదిగంటల సమయం దాటింది. 

దీంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పోలీసులు రోడ్లపై ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. ఈ పాస్ ఉన్న వాహనాలను పోలీసులు అనుమతించారు. ఈ పాస్ లేని వాహనాలను రోడ్లపైనే నిలిపివేశారు.  ఈ నెల 22 న బెల్లంపల్లిలో వివాహం జరిగింది. ఆ తంతు ముగిసిన తర్వాత వరుడు   తన భార్యతో  కరీంనగర్ కు వెళ్తుండగా నవ దంపతులతొ పాటు బంధువుల వాహనాలను కూడా సీజ్ చేశారు

Latest Videos

 పోలీసులు.  మరో డీసీఎం వాహనంలో కొంతమంది  పెళ్లికి  వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ పాస్   లేకపోవడంతో   ఆ వాహనాన్ని పోలీస్టేషన్ కు  తరలించారు. రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు లాక్‌డౌన్ ను రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్‌డౌన్ ఆంక్షలకు మినహాయింపులు ఇచ్చారు. అయితే ఈ మినహాయింపు సమయంలోనే  ప్రయాణాలు చేస్తూ పోలీసులకు చిక్కారు నవదంపతులు.

click me!