టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఫైర్

By AN TeluguFirst Published Feb 2, 2021, 9:53 AM IST
Highlights

ఆ కులం ఆఫీసర్లకు ఒక్క ముక్క రాదు, పనికిరాదు అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. అట్లనా? ఈ దేశ రాజ్యంగాన్ని రాసిందెవరు భై? నిన్ను ఎన్నో అనాలనుంది...కానీ నియంత్రించుకుంటున్నా.. ఎందుకంటే నేను చదువుకున్నోన్ని..కొన్నోన్ని కాదు..చదువును అమ్ముకునెటోన్ని అంతకన్నా కాదు. నువ్వెంత విషంతో కుళ్లుకు చచ్చినా మేం అక్షరాలతోనే ఆకాశం అంచులను అందుకుంటామని  ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ ద్వారా గట్టి సమాధానం ఇచ్చారు. 

అయితే, ఓసీ మహాగర్జన సభలో మాట్లాడిన తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. తనపై బురదజల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలు తప్పైతే ఆ వ్యాఖ్యలను విరమించుకుంటున్నానని ప్రకటించారు. 

నా వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వివరించే క్రమంలో అలా మాట్లాడానని ధర్మారెడ్డి చెప్పారు .అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధుల సేకరణకు సంబంధించి కొద్ది రోజుల కిందట పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక  సమావేశంలో మాట్లాడారు. 

‘‘రామాలయం నిర్మాణం పేరుతో బీజేపీ శ్రేణులు ఇంటింటికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దొంగ బుక్కులు పట్టుకొని చందాల దందాలకు పాల్పడుతున్నారు. గుడి నిర్మాణం పేరుతో తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు రూ.1000కోట్లు వసూలు చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇక దేశంలో ఎంత వసూలు చేస్తారో? అయోధ్య రామాలయం పేరుతో వసూలు చేస్తున్న నిధులకు లెక్క చెప్పాలి. లెక్కలు చూపే వరకు పోరాటం చేస్తాం. శ్రీరాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. వికృత చేష్టలకు పాల్పడుతోంది’’ అని తీవ్ర స్థాయిలో  ధ్వజమెత్తారు.
 
click me!