తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం.. లిస్ట్ ఇదే..!!

By Siva KodatiFirst Published Oct 13, 2021, 7:03 PM IST
Highlights

తెలంగాణ హైకోర్టుకు (telangana high court) కేంద్ర ప్రభుత్వం ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది. ఈ మేరకు జస్టిస్ పెరుగు శ్రీసుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ వెంకటేశ్ రెడ్డి, జస్టిస్ మాధవిదేవిలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 

తెలంగాణ హైకోర్టుకు (telangana high court) కేంద్ర ప్రభుత్వం ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది. ఈ మేరకు జస్టిస్ పెరుగు శ్రీసుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ వెంకటేశ్ రెడ్డి, జస్టిస్ మాధవిదేవిలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, ఈ నెల 5న దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల (High Court Judges) ను కేంద్ర ప్రభుత్వం (Govt Of India) బదిలీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం (supreme court collegium) సిఫారసులు పంపింది. ఇందులో 15 మంది బదిలీ సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. 

హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించడానికి ఆగస్టు 25, సెప్టెంబర్ 1న కొలీజియం సభ్యులు సమావేశమై 112 మంది పేర్లను పరిశీలించారు. ఇందులో నుంచి 68 మందిని ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేశారు. 68 మందిలో 44 మంది బార్ సభ్యులను ఎంపిక చేసుకోగా మిగతావారు జ్యుడిషియల్ అధికారులు. న్యాయశాఖ ప్రకారం, ఈ నెల 1వ తేదీనాటికి మొత్తం 25 హైకోర్టుల్లో 465 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 68 ఖాళీలున్నాయి. పంజాబ్, హర్యానాలో 40, కలకత్తాలో 36 ఖాలీలున్నాయి.

Also Read:సుప్రీం కొలీజియం సిఫారసులకు కేంద్రం ఆమోదం.. దేశంలో 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

అలహాబాద్ హైకోర్టు కోసం 16 మందిని, కేరళ హైకోర్టుకు 8 మందిని, కలకత్తా, రాజస్తాన్ హైకోర్టులకు ఆరుగురి చొప్పున నియమించాలని తాజా ప్రతిపాదనలో కొలీజియం పేర్కొంది. వీరితోపాటు గౌహతి, జార్ఖండ్ హైకోర్టుకు ఐదుగురి చొప్పున, పంజాబ్, హర్యానాలకు నలుగురి చొప్పున, చత్తీస్‌గఢ్ హైకోర్టుకు ఇద్దరిని, మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఒకరిని నియమించాలని తెలిపింది.

ఈ సిఫారసులో మరో రికార్డు కూడా ఉన్నది. మిజోరం నుంచి తొలిసారిగా హైకోర్టుకు పదోన్నతి కల్పించడానికి ప్రతిపాదించింది. మిజోరం రాష్ట్రానికి చెందిన మర్లి వాంకూంగ్‌ పేరును కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఆగస్టు 17న తెలంగాణ హైకోర్టు కోసం ఏడుగురి పేర్లను కొలీజియం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

click me!