ఛార్జీల పెంపు తప్పదా?: ఏప్రిల్ 1 నుండి తెలంగాణలో కొత్త విద్యుత్ చార్జీలు

Published : Mar 01, 2022, 11:04 AM IST
ఛార్జీల పెంపు తప్పదా?: ఏప్రిల్ 1 నుండి తెలంగాణలో కొత్త విద్యుత్ చార్జీలు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ నెలాఖరులోపుగా విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై తుది తీర్పును వెల్లడిస్తామని ఈఆర్‌సీ ఛైర్మెన్ శ్రీరంగరావు ప్రకటించారు.  

హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి  కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.  విద్యుత్ ఛార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి. ప్రతిపాదిత చార్జీల పెంపును కూడా ఈఆర్‌సీకి డిస్కంలు ప్రతిపాదించాయి.  అయితే ఈ విషయమై రాష్ట్రంలోని పలు చోట్ల ఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించింది. పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు బహిరంగ విచారణలో పాల్గొని ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

తమకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అవసరం లేదని రైతులు చెప్పారని ఈఆర్‌సీ చైర్మెన్ శ్రీరంగరావు మీడియాకు చెప్పారు.  పరిశ్రమలు, మెట్రో సిటీలకు పీక్ అవర్స్ లో విద్యుత్ సరఫరా చేసే సమయంలో తమకు విద్యుత్ అవసరం లేదని రైతులు చెప్పారని శ్రీరంగరావు మీడియాకు తెలిపారు.  ఈ నెల 31వ తేదీ లోపుగా విద్యుత్ చార్జీల విషయమై ఈఆర్‌సీ తుది తీర్పును వెల్లడించనుంది. గత నెల 25వ తేదీతో  చార్జీల పెంపుపై బహిరంగ విచారణలు పూర్తయ్యాయి. అయితే ఛార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరుతున్నాయి. 

 రాష్ట్రంలో రూ. 6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు Erc కి  డిస్కంలు  tariff ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు రూ.4,037 కోట్లను ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు అంతర్గత సామర్ధ్యంతో పూడ్చుకొంటామని  డిస్కం సంస్థలు ఈఆర్సీకి తెలిపాయి. 2021 డిసెంబర్ 1వ తేదీన discomలు ఈఆర్సీకి Arr లను సమర్పించాయి.

2021-22 ఏడాదికి గాను Electricity  charges పెంపునకు గాను  ప్రతిపాదనలు  పంపాలని ఈఆర్సీ డిస్కంలకు వారం రోజుల గడువును ఇస్తూ 2021 డిసెంబర్  21న ఆదేశాలు జారీ చేసింది. దీంతో  డిసెంబర్ 28న చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాయి.

తెలంగాణలో 2022-23 లో రెండు డిస్కం కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన ఏఆర్‌ఆర్‌లను సమర్పించాయి. 2022-23  లో రూ.53,053 కోట్ల రెవిన్యూ అవసరం. రూ. 36, 474 కోట్ల రెవిన్యూ వస్తోందని డిస్కం కంపెనీలు అంచనా వేశాయి. రూ.5652 కోట్లు ప్రభుత్వం నుండి సబ్సిడీ రూపంలో వస్తాయని డిస్కం కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సుమారు రూ.10,928 కోట్ల రెవిన్యూ లోటు ఉంటుందని అంచనా వేశాయి

అయితే ఈ రూ. 10,928 కోట్ల రెవిన్యూ లోటును పూడ్చుకొనేందుకు గాను విద్యుత్ చార్జీల పెంపునకు గాను డిస్కం కంపెనీలు టారిఫ్ పెంపు ప్రతిపాదనలను  ఈఆర్సీసీకి ప్రతిపాదనలు అందించాయి.రూ.6831 కోట్లను చార్జీల పెంపు ద్వారా ఆర్జించాలని ప్రతిపాదనలను పంపాయి.గృహ వినియోగదారులకు  యూనిట్ కు 50 పైసలు, ఇతర వినియోగదారులకు యూనిట్ కు రూ. 1 పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమయిందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని  ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు చెబుతున్నారు.

డొమెస్టిక్ కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి.ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు  24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ కింద అందించనున్నారు. అయితే ఈ సబ్సిడీని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు అందించనుంది.
 

PREV
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu