నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

Published : Sep 19, 2018, 05:28 PM ISTUpdated : Sep 19, 2018, 05:36 PM IST
నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

సారాంశం

ఇష్టం లేని పెళ్లి చేసుకొన్నందుకు గాను ఎస్ఆర్ నగర్ లో  నవ దంపతులపై  ఓ తండ్రి  కత్తితో దాడి చేశారు.  అయితే నవదంపతులకు బట్టలు పెడతామని పిలిపించి దాడికి పాల్పడ్డాడు

హైదరాబాద్:ఇష్టం లేని పెళ్లి చేసుకొన్నందుకు గాను ఎస్ఆర్ నగర్ లో  నవ దంపతులపై  ఓ తండ్రి  కత్తితో దాడి చేశారు.  అయితే నవదంపతులకు బట్టలు పెడతామని పిలిపించి దాడికి పాల్పడ్డాడు.  ఈ దాడిలో నవ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

హైద్రాబాద్ ‌కు చెందిన బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు ప్రేమించుకొన్నారు. ఈ ప్రేమను  అమ్మయి తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. అంతేకాదు మాధవిని మేనమామకు ఇచ్చి పెళ్లి చేయాలని  మాధవి తండ్రి నిర్ణయం తీసుకొన్నాడు.

కానీ, మాధవి తండ్రి మాత్రం ఒప్పుకోలేదు.దీంతో వారం రోజుల క్రితం మాధవి, సందీప్ లు ఇంట్లో నుండి పారిపోయారు. రిజిస్టర్ మ్యారేజీ చేసుకొన్నారు. ఈ రిజిస్టర్ మ్యారేజీ చేసుకొన్న విషయం  తెలిసింది.

"

తాము పెళ్లి చేసుకొన్న తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీసులను నవ దంపతులు ఆశ్రయించారు. అయితే రెండు కుటుంబాలను  పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినా కూడ  మాధవి తండ్రిలో ఏ మాత్రం కోపం తగ్గలేదు.

నవ దంపతులకు కొత్త బట్టలను పెడతానని పిలిపించాడు మాధవి తండ్రి. ఎస్ఆర్ నగర్ లో రోడ్డుపై ఉన్న మాధవి తండ్రి బ్యాగులో కొబ్బరి బండం కత్తిని వెంట తెచ్చుకొన్నాడు. నవ దంపతులను విచక్షణరహితంగా కత్తితో దాడి చేశారు.

సంబంధిత వార్తలు

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu