పాతబస్తీలో దారుణం.. పురుటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన గర్భిణీ.. డీజే పెట్టి చిందులేసిన సిబ్బంది..

Published : Jun 27, 2022, 01:36 PM IST
పాతబస్తీలో దారుణం.. పురుటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన గర్భిణీ.. డీజే పెట్టి చిందులేసిన సిబ్బంది..

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి నరకం అనుభవించింది. నవజాత శిశువును కోల్పోయింది. 

హైదరాబాద్  : హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ లో దారుణం జరిగింది. చాదర్ ఘాట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో డెలివరీ కోసం వచ్చిన మహిళను హాస్పిటల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఒకవైపు పురిటి నొప్పులతో బాధపడుతున్న పేషెంట్ ని పట్టించుకోకుండా హాస్పిటల్ ను ఫైవ్ స్టార్ ఫంక్షన్ హాల్ గా మార్చేసి..  డీజే పెట్టి, బాణాసంచా కాలుస్తూ...  హాస్పిటల్ సిబ్బంది నానా హంగామా చేశారు. వచ్చే నెలలో డాక్టర్ కూతురు వివాహం ఉండటంతో ముందస్తుగానే ఆసుపత్రి బిల్డింగ్‌పై పార్టీ చేసుకున్నారు. డీజేలతో డ్యాన్స్‌లు చేస్తూ ఆసుపత్రి సిబ్బంది వేడుకల్లో మునిగిపోయారు. 

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మరణించింది. ఈ సమయంలోనే లోబిపితో వచ్చిన గర్భిణీని అడ్మిట్ చేసుకున్న సిబ్బంది.. బిపిని నార్మల్ చేశారు. ఆ తర్వాత బాధితురాలిని ఆసుపత్రిలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. పరిస్థితి విషమించడంతో పుట్టబోయే బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఈ సమయంలో బాధితురాలు బెడ్ పైన నరకం అనుభవించింది. దీనంతటికీ కారణం సిబ్బంది హాస్పిటల్ లో ఫంక్షన్ చేసుకోవడమేనని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

గచ్చిబౌలి పబ్‌లో జరిగింది కల్చరల్ పార్టీ..లిక్కర్ సరఫరా జరగలేదు: మాదాపూర్ డీసీసీ

ప్రైవేట్ మెటర్నిటీ హాస్పిటల్ ఫైవ్ స్టార్ ఫంక్షన్ హాల్ గా మార్చి…  హాస్పిటల్ సిబ్బంది గానా, బజానాతో బాణాసంచా కాల్చి పెద్ద హంగామా సృష్టించారని, దీంతో మహిళ ఆరోగ్యం క్షీణించి కడుపులోని బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరకు అతికష్టం మీద మహిళ ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆసుపత్రి తీరుపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సిబ్బంది మొత్తం హాస్పిటల్ వదిలేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bandi Sanjay Reaction About Akhanda2 : అఖండ 2 సినిమా చూసి బండి సంజయ్ రియాక్షన్| Asianet News Telugu
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు: Telangana Assembly | Asianet News Telugu