
కామారెడ్డి జిల్లా శెట్‌పల్లిలో వాగులో చిక్కుకున్న ముగ్గురిని రక్షించాయి సహాయక బృందాలు. తాడు సాయంతో ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు సిబ్బంది. చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు.. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో వాగులోని ఓ చెట్టును పట్టుకుని ఎక్కారు. అనంతరం సాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ధైర్యంగా వుండాలన్నారు. అనంతరం వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు ముగ్గురిని కాపాడాయి.