జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ తన ప్రతిభతో మరోసారి ఆకట్టుకున్నాడు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బియ్యం గింజ మధ్యలో బంగారు జాతీయ జెండాను తయారు చేసి అబ్బురపరిచాడు.
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బియ్యం గింజ మధ్యలో బంగారు జాతీయ జెండాను తయారు చేసి అబ్బురపరిచాడు. దాదాపు 12 గంటల పాటు శ్రమించిన దయాకర్ బియ్యపు గింజ మధ్యలో బంగారు జాతీయ పతాకాన్ని అమర్చాడు. గతంలో పక్షి ఈకపైన భారతదేశ చిత్రపటాన్ని అందులో స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులు గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ , నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రాలను ఒక సెంటీమీటర్ సైజులో వేశారు. ఈ చిత్రాలు వేయడానికి 10 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపాడు
ఈ కళా రూపాలను చూసి పలువురు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేశారు
undefined