మా ఆస్తుల విలువ పెరిగితే ఈర్ష్య ఎందుకు?: భూమా అఖిలప్రియjకు శిల్పా రవి కౌంటర్

By narsimha lode  |  First Published Feb 5, 2023, 10:43 AM IST

తనపై  మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ  చేసిన ఆరోపణల్లో  వాస్తవం లేదని  నంద్యాల  ఎమ్మెల్యే   శిల్పా రవి  చెప్పారు.  భూమా కుటుంబం  ఆస్తి విలువ పెరిగితే తాము  ఈర్ష్య పడుతున్నామా  అని ఆయన ప్రశ్నించారు. 


నంద్యాల:తమ ఆస్తి విలువ  పెరిగితే  మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు  ఎందుకు  ఈర్ష్య అని  నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవి  ప్రశ్నించారు.   ఆదివారం నాడు  నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవి  మీడియాతో మాట్లాడారు. 

ఆళ్లగడ్డలోని కందుకూరులో   భూమా నాగిరెడ్డి,  ఏవీ సుబ్బారెడ్డిలు  200 ఎకరాల భూమిని  కొనుగోలు  చేశారన్నారు.  అతి తక్కువ  ధరకు  ఈ భూములు కొనుగోలు  చేశారని  శిల్పా రవి  వివరించారు.ఈ ఆస్తి   విలువ భారీగా పెరిగిన విషయాన్ని ఆయన  గుర్తు  చేశారు.  మీ ఆస్తి  విలువ పెరిగినందుకు  తాము బాధ పడడం లేదన్నారు.  తన ఆస్తిపై మీరు  ఏడవడం  ఎందుకో అర్ధం కావడం లేదన్నారు.  

Latest Videos

వ్యాపారం  చేసి  తాము ఆస్తులు  కొనుగోలు  చేసినట్టుగా  శిల్పారవి తెలిపారు.  తాము వ్యాపారం  చేస్తే  భూమా అఖిలప్రియకు  ఎందుకు ఈర్ష్యపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. మెడికల్  కాలేజీ వస్తుందని  50 ఎకరాలు  ఇన్ సైడర్ ట్రేడింగ్  చేశారని  తనపై  భూమా అఖిలప్రియ  చేసిన ఆరోపణలపై  కూడా  శిల్పా రవి స్పందించారు.  తమకు  30 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. మిగిలిన 20 ఎకరాలు  ఎవరైనా తీసుకువచ్చని ఆయన  స్పష్టం  చేశారు.  50 ఎకరాల ు కమర్షియల్  చేశారన్నది అవాస్తవమని  నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవి  చెప్పారు.  తమకు ఉన్న  30 ఎకరాలు కూడా ఒకే దగ్గర లేదన్నారు.  తన తండ్రి గతంలో  దాఖలు  చేసిన ఎన్నికల అపిడవిట్ ను కూడా చెక్ చేసుకువచ్చని  శిల్పా  రవి  చెప్పారు.   హైద్రాబాద్ లో  డెవలప్ అయ్యే ప్రాంతాల్లో  తాము భూముల కొనుగోలు  చేసినట్టుగా  శిల్పా రవి  తెలిపారు.   తమ ఆస్తుల విలువ  పెరిగితే  మీకెందుకు  బాధ అని   ఆయన ప్రశ్నించారు.   అఖిలప్రియ తీరు హస్యాస్పదంగా ఉందని  నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి  విమర్శించారు.  తనపై  భూమా అఖిలప్రియ చేసిన  ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.  ఎదుటి వారిపై ఈర్ష్య పడే కంటే  వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని  శిల్పా రవి  మాజీ మంత్రి అఖిలప్రియకు  సూచించారు.  

తాను చేసిన మోసాలపై  ఆధారాలను బయటపెడతానని  అఖిలప్రియ  చెప్పారన్నారు. కానీ  తాము ఏం దోపీడీ చేశామో  చెప్పలేకపోయినట్టుగా  శిల్పా రవి  చెప్పారు.అఖిలప్రియ  చేసిన ఆరోపణల్లో విషయం,  పరిజ్ఞానం లేవని  ఆయన విమర్శించారు. 

 2004కు  ముందు  నంద్యాలలో  బస్టాండ్ మార్పు  అంశంపైనే ప్రధానంగా  ఎన్నికలు జరిగిన  విషయాన్ని  శిల్పా రవి గుర్తు  చేశారు.  ఈ ఎన్నికల్లో  భూమా  కుటుంబం ఎందుకు ఓటమి పాలైందని ఆయన  ప్రశ్నించారు. 

also read:రెండు రోజులుగా ఎంటరర్‌టైన్ మెంట్ షో: భూమా అఖిలప్రియపై శిల్పా రవి
మూడు రోజులుగా  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ , నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవి మధ్య మాటల యుద్ధం సాగుతుంది.  ఈ నెల  4వ తేదీన  శిల్పా రవి అక్రమాలపై ఆధారాలను బయటపెడతానని  భూమా అఖిలప్రియ  ప్రకటించారు.  అయితే  నిన్న  భూమా అఖిలప్రియను  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.  నిన్న మరోసారి  భూమా అఖిలప్రియ  శిల్పా రవి పై మరోసారి విమర్శలు  చేశారు. ఈ విమర్శలపై  ఇవాళ శిల్పారవి  వివరణ ఇచ్చారు. 

click me!