నిజామాబాద్ జిల్లాలో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదు

By narsimha lodeFirst Published Feb 5, 2023, 9:16 AM IST
Highlights

నిజామాబాద్ సహ పరిసర ప్రాంతాల్లో  ఇవాళ  ఉదయం  భూకంపం  సంబవించింది.  రిక్టర్ స్కేల్ పై  భూకంప తీవ్రత  3.1 గా  నమోదైంది. 


నిజామాబాద్:  నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో  ఆదివారం నాడు  ఉదయం  భూకంపం చోటు చేసుకుంది.  రిక్టర్ స్కేల్ పై  3.1 తీవ్రత  నమోదైంది.   భూకంపం కారణంగా  ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.  భయంతో  స్థానికులు  పరుగులు తీశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇటీవల కాలంలో  భూ ప్రకంపనాలు  ఇటీవల  కాలంలో  ఎక్కువగా నమోదౌతున్నాయి.  భూకంపాలు  ఎందుకు  నమోదౌతున్నాయనే విషయమై   అధికారులు  పరిశోధనలు చేస్తున్నారు. 2022 డిసెంబర్  6వ తేదీన  జహీరాబాద్  మండలం  బిలాపూర్ లో   భూకంపం  చోటు  చేసుకుంది. భారీ శబ్దంతో  భూమి కంపించడంతో  స్థానికులు  భంయంతో  పరుగులు తీశారు. రామగుండం, మంచిర్యాల, కరీంనగర్  లలో  2021 అక్టోబర్  2న భూకంపం  వచ్చింది.  భూకంప తీవ్రత  4.0 గా నమోదైంది. 2022 అక్టోబర్  15న  ఆదిలాబాద్ జిల్లాలో  భూకంపం  వాటిల్లింది.2021 నవంబర్  1న తెలంగాణ రాష్ట్రంలోని  కుమరంభీమ్  జిల్లా , మంచిర్యాల జిల్లాలో  స్వల్పంగా  భూప్రకంపనలు  వచ్చాయి.ఈ ఏడాది  నవంబర్  29న ఢిల్లీలోని ఎన్సీఆర్   ప్రాంతంలో  భూకంపం  వాటిల్లింది. 2.5  తీవ్రతతో  భూకంపం వచ్చింది.  

click me!