వెనుకంజలో నందమూరి సుహాసిని

By Nagaraju TFirst Published Dec 11, 2018, 9:23 AM IST
Highlights

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నియోజకవర్గం కూకట్ పల్లి. ఈ నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సుహాసిని పోటీ చాలా ఆసక్తిగా మారింది.  

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నియోజకవర్గం కూకట్ పల్లి. ఈ నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సుహాసిని పోటీ చాలా ఆసక్తిగా మారింది.  

అయితే ఈ ఎన్నికల్లో మెుదటి రౌండ్, రెండో రౌండ్లో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. మెుదటి రౌండ్ మరియు రెండో రౌండులలో 3 వేల ఓట్లు వెనుకంజలో ఉన్నారు. ముందంజలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు దూసుకుపోతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.
 

click me!