వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

Published : Dec 11, 2018, 09:17 AM IST
వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కందూరు జానారెడ్డి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య కంటే వెనుకంజలో ఉన్నారు. మెుదటి రౌండ్ నుంచి జానారెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గట్టిపోటీ ఇస్తూనే ఉన్నారు.   

నల్గొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కందూరు జానారెడ్డి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య కంటే వెనుకంజలో ఉన్నారు. మెుదటి రౌండ్ నుంచి జానారెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గట్టిపోటీ ఇస్తూనే ఉన్నారు. 

ఇకపోతే జానారెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమిపాలవుతారని టీఆర్ఎస్ నేత కేటీఆర్, కేసీఆర్ లు పదేపదే చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకునే జానారెడ్డి ఘోరంగా ఓడిపోవడం ఖాయమంటూ ప్రకటనలు చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!