మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు అస్వస్థత

Published : Dec 07, 2018, 07:40 AM ISTUpdated : Dec 07, 2018, 08:50 AM IST
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు అస్వస్థత

సారాంశం

మాజీ మంత్రి ఆలేరు నుండి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యారు


ఆలేరు: మాజీ మంత్రి ఆలేరు నుండి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యారు.  కుటుంబసభ్యులు ఆయనను భువనగరి ఆసుపత్రికి తరలించారు.

ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్  నుండి   మాజీ మంత్రి నర్సింహులు  బరిలో నిలిచారు.  పోలింగ్ రోజున నర్సింహులు అస్వస్థతకు గురికావడం పట్ల ఆయన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. హుటా హుటిన ఆయనను భువనగిరి ఆసుపత్రికి తరలించారు.


ఈ ఏడాది మే మాసంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా తీవ్ర  విమర్శలు చేశారు. దీంతో మోతుపల్లి నర్సింహులును టీడీపీ నుండి బహిష్కరించారు.పార్టీ నుండి బహిష్కరించడంతో  చంద్రబాబుపై  తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.


ఈ దఫా  బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా మోత్కుపల్లి నర్సింహులు బరిలోకి దిగారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ మోత్కుపల్లి నర్సింహులు ప్రచారం నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?
తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!