
గంజాయి స్మగ్లింగ్ కేసు (ganja smuggling) విషయంలో హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు (nampally court) మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఒక వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది. రెండేళ్ల క్రితం 1,427 కిలోల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పంతంగి టోల్ ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులకు (dri officials) పట్టుబడ్డాడు నదీమ్ అనే వ్యక్తి. వీటి విలువ రూ.3.56 కోట్లకు పైనే వుంటుందని అంచనా.
తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్‌కు భారీ ట్రక్కులో ఈ గంజాయిని తరలిస్తుండగా డీఆర్‌ఐ హైదరాబాద్ విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద (panthangi toll plaza) మాటు వేసిన అధికారులు నదీమ్‌ను పట్టుకుని పలు అభియోగాలను మోపారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఇవాళ తుది తీర్పు ప్రకటించింది. ఈ సందర్భంగా నదీమ్‌కు రూ. 20 ఏళ్ల జైలుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించారు న్యాయమూర్తి.
మరోవైపు గంజాయితో పాటు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా పోలీసులు తరచూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే.. Drugs తీసుకొంటూ పట్టుబడిన Software ఉద్యోగులపై వేటు పడింది. డ్రగ్స్ తీసుకొంటున్నారని పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు 13 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఆయా సంస్థలు Jobs నుండి తొలగించారు. మరో 50 మంది Techieలకు కూడా సాఫ్ట్‌వేర్ సంస్థలు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన పెడ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు టెక్కీలను అరెస్ట్ చేశారు. ప్రేమ్ కుమార్, టోని, లక్ష్మీపతి వద్ద నుండి డ్రగ్స్ , గంజాయిని టెక్కీలు కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు. హైద్రాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న పార్టీలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద టెక్కీల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ సమాచారాన్ని రూఢీ చేసుకున్న తర్వాత పోలీసులు టెక్కీలు పనిచేస్తున్న కంపెనీలకు సమాచారం పంపారు. అమెజాన్, ఇన్పోసిస్, మైక్రోసాఫ్ట్, మహేంద్ర, క్యూ వంటి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు డ్రగ్స్ తీసుకొంటూ పట్టుబడ్డారు.
సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు గంజాయితో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని కూడా గుర్తించారు. సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేస్తూ ఇద్దరు మహిళలు గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆరు మాసాలుగా టెక్కీలు ఏఏ పబ్ లకు వెళ్లారనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు డ్రగ్స్ ఎలా అందుతున్నాయనే విషయాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. వీకేండ్లలో పబ్ లలో జరిగే పార్టీలతో పాటు నగర శివార్లలోని ఫామ్ హౌజ్‌లలో నిర్వహించే పార్టీలపై కూడా పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు.